
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్...
Jun 20 2026 9:54 PM | Updated on Jun 20 2026 9:54 PM
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అతడు ఈ భారీ రికార్డును నమోదు చేశాడు.
ఈ మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 171 మ్యాచ్‌లు పట్టగా.. రూట్ కేవలం 164 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌ల పరంగా అయితే రూట్(302) కంటే సచిన్(279) ముందున్నారు. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టే దిశగా జో రూట్ శరవేగంగా దూసుకుపోతున్నాడు.
ఈ ఇంగ్లండ్ దిగ్గజం ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 14052 పరుగులు చేశాడు. ప్రస్తుత అతని ఫామ్ చూస్తుంటే, రెండు మూడేళ్లలో సచిన్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రూట్‌నే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రూట్ 76 మ్యాచ్‌లలో 51.78 సగటుతో 6577 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(4,564) ఉన్నాడు.
ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీతో కివీస్‌ను ఆదుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ జట్టు అద్భుతంగా ఆడి 362 పరుగులు చేసింది.
మొత్తంగా ఆతిథ్య జట్టు ముందు కివీస్ 463 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 326 పరుగులు కావాలి. హ్యారీ బ్రూక్(58), రూట్(57) పోరాడుతున్నారు. చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు)
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు)
‘నాగబంధం’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు)
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)
నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా!
Missing Case: చిన్నారి ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు
జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. ఆ 15 నిమిషాలు ఏం జరిగింది?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ
వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు