
హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరూ బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరూ బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు. దోపిడీకి గురికాకుండా ఉండాలని ప్రత్యేక తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు కొట్లాడారని తెలిపారు. హైడ్రా ద్వారా లక్ష పదివేల కోట్ల ఆస్తులు కాపాడమని వివరించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ వేదికగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. హైడ్రా ద్వారా 600 ఆపరేషన్స్ పూర్తి చేశామని తెలిపారు. చట్టం అందరికీ ఒకటేనని... హైడ్రా ఎవరికీ పక్షపాతంగా వ్యవహరించదని స్పష్టం చేశారు. హైడ్రా డిజాస్టర్ కోసం కాదని.. ఆస్తుల పరిరక్షణ కోసమేనని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాష్ట్ర సర్కార్ హైడ్రాకి ఫ్రీడం ఇచ్చిందని రంగానాథ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా తాము పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భాగ్యనగరంలో ఫాతిమా కాలేజీ లాగా చాలా స్కూల్స్, కాలేజీలు ఉన్నాయని ప్రస్తావించారు. హైడ్రాకి ఎంఐఎం, కాంగ్రెస్ అందరూ ఒకటేనని తేల్చిచెప్పారు. హైడ్రా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదన్నారు. హైడ్రా రాత్రికి రాత్రి నిర్మాణాలను కూలగొడుతుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. గుడిసెలు వేసిన చోట మీడియాని తీసుకెళ్లి చూపించామని... అప్పుడు ఉన్నదాని కంటే వంద గుడిసెలు ఎక్కువగా పెరిగాయని.. దాని వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గుడిసెలు వేసిన చోట జెన్యూన్‌గా ఉన్నాయా? లేదా? పరిశీలించి... డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంచి చేయాలంటే కొందరికీ చెడూ కూడా జరుగుతుంది..
హైడ్రా రాకపోతే... ఇప్పుడు ఉన్నవి కూడా కనపడకుండా పోయేవని రంగనాథ్ తెలిపారు. ఈ నెల 9వ తేదీన భాగ్యనగరంలో కురిసిన వర్షానికి సిటీ అతలాకుతలం అయిందని అన్నారు. లక్షమందికి మంచి చేయాలంటే కొందరికీ చెడూ కూడా జరుగుతుందని తెలిపారు. హైడ్రా తప్పు ఉంటే తప్పకుండా క్షమాపణ అడుగుతామని చెప్పారు. హైడ్రా చాలా నేర్చుకుందని, చాలా పనులు పూర్తి చేసిందని... తప్పులు జరిగితే.. సరి చేసుకుంటూ ముందుకెళ్తుందని వివరించారు. హైడ్రా సెటిల్మెంట్లకు అడ్డగా కాకుండా.. రాజకీయాలకు అతీతంగా ముందుకు పోతుందని స్పష్టం చేశారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగేంచే విధంగా హైడ్రా పని చేస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News