
సాయికృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం. స్వర్గపురి శ్మశానంలో రికార్డుల తనిఖీ. ఎలక్ట్రికల్ ఆపరేటర్ బాషా అరెస్ట్. SaiKrishna Case: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ(SaiKrishna Case) కేసులో...
సాయికృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం. స్వర్గపురి శ్మశానంలో రికార్డుల తనిఖీ. ఎలక్ట్రికల్ ఆపరేటర్ బాషా అరెస్ట్. SaiKrishna Case: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ(SaiKrishna Case) కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో మృతదేహం దహనానికి సంబంధించిన ఆధారాల కోసం కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికలో కృష్ణలంక సీఐ పవన్ కిషోర్ ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. అక్కడ పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి, గత కొన్ని రోజులకు సంబంధించిన కీలక రికార్డులను, కంప్యూటర్ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Bandi Bhagirath Bail: పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్. రికార్డులు స్వాధీనం.. సిబ్బంది వెల్లడి: ఈ విచారణపై స్వర్గపురి కంప్యూటర్ ఆపరేటర్ రవి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 23, 24, 25 తేదీల్లో మూడు అనాథ శవాలు ఇక్కడికి వచ్చాయని, వాటికి సంబంధించిన పూర్తి రికార్డులను పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. 23వ తేదీన విజయవాడ బస్టాండ్ పరిసరాల నుండి ఒక మృతదేహం వచ్చిందని చెప్పారు. సాధారణంగా పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగానే తాము దహన సంస్కారాలు నిర్వహిస్తామని, ఎవరి శవం అనే వివరాలు తాము వ్యక్తిగతంగా పరిశీలించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ ఆపరేటర్ బాషా అదుపులోకి.. ఫోన్ సీజ్: కేసులో మరిన్ని నిజా నిజాలను వెలికితీసేందుకు కృష్ణలంక స్వర్గపురిలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే ఆపరేటర్ 'బాషా'ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో బాషాను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని అనాథ శవంగా చిత్రీకరించి ఇక్కడే దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.