
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Father's Day History 2026: మొదట్లో దీనికి అంత ప్రాచుర్యం లేకపోయినా, కాలక్రమేణా 'ఫాదర్స్ డే'ని అందరూ జరుపుకోవడం మొదలుపెట్టారు. మన దేశంలో కూడా ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా జరుపుకోంటున్నారు ఆనవాయితీగా మారింది. నాన్న అంటేనే బాధ్యత; కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత, కన్నీళ్లు తుడిచే ఆప్యాయత. ముఖ్యంగా ఒక ఆడపిల్లకు నాన్న అంటే జీవితాంతం మర్చిపోలేని ఒక అనుభూతి. పిల్లల ఎదుగుదల కోసం ఆయన పడే కష్టం, త్యాగం, ప్రేమను గౌరవించాలని ఫాదర్స్ డే ఉద్దేశ్యం. పిల్లల్ని పెంచే క్రమంలో ఆయన ఎప్పుడూ నాకు 'మీరంటే ఇష్టం' అని నోరారా చెప్పకపోవచ్చు. కానీ, అది ఆయన పెంపకంలో, మనపై తీసుకునే జాగ్రత్తలో.. కష్టసమయంలో, వెన్నంటి ఉన్నప్పుడు, దారి చూపినపుడు, కన్నీళ్లు తుడిచినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నాన్న కోసం ఒక రోజును కేటాయించారు. అసలు అంతర్జాతీయ ఫాదర్స్ డే ఎలా ప్రారంభమైంది, ఏ దేశాల్లో జరుపుకుంటున్నారు, దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోనోరో స్మార్ట్ డాడ్ అనే అమ్మాయి ఈ ఫాదర్స్ డే సంప్రదాయాన్ని ప్రారంభించింది. చిన్నా నాడే ఆమె తన తల్లిని కోల్పయింది. తన తండ్రి తల్లి స్థానంలో ఉండి తనను, ఇద్దరు తమ్ముళ్లను ఎంతో ప్రేమగా పెంచారు. ఈయన కేప్టెన్‌గా పనిచేస్తూనే పిల్లల బాధ్యతను తల్లీతండ్రి పాత్రల్లో ఉండి మరీ పెంచారు. వీరు వాషింగ్టన్లో ఉండేవారు. తన తండ్రి తన జీవితాన్ని అంకితం చేస్తూ, తల్లి లేని లోటు తెలియకుండా పడిన కష్టాలను ఆమె ఒకసారి చర్చిలో మదర్స్ డే జరుపుకుంటున్న సమయంలో గుర్తు చేసుకున్నారు. అప్పుడే తండ్రి పాత్రకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు అవసరమని సోనోరో గ్రహించి, ఫాదర్స్ డేని కూడా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా 1910, జూన్ 19వ తేదీన మొదటిసారిగా ఫాదర్స్ డేని జరుపుకున్నారు.
ఆ తర్వాత అందరూ దీనిని పాటించడం మొదలుపెట్టారు. 1916లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీనిని ఆమోదించడంతో, 1966 నుండి జూన్ నెలలోని మూడో ఆదివారాన్ని అధికారికంగా ఫాదర్స్ డేగా ప్రకటించారు. అప్పటి నుండి ఇది కొనసాగుతోంది.
మన జీవితంలో తల్లిదండ్రుల పాత్రను ఎవరితోనూ పోల్చలేము. తల్లి తొమ్మిది నెలలు మోసి పెంచితే, తండ్రి జీవితాంతం మన బాధ్యతను తీసుకుని పెంచుతాడు.. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల కోసం నిలబడతాడు. జీవితంలో ఒకసారి తండ్రిని కోల్పోతే ఆ స్థానాన్ని మళ్ళీ ఎవరూ భర్తీ చేయలేరు. నాన్న ఒక సలహా, ఒక మార్గం, ఒక స్ఫూర్తి. ముఖ్యంగా ఒక అమ్మాయికి తండ్రే సూపర్ హీరో. నాన్న లేకుంటే జీవితాంతం భర్తీ చేయలేని వెలితి. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అందుకే ఆయన చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నాన్నకు ఒక రోజు కేటాయించడం అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం.
ఫాదర్స్ డే ఎలా జరుపుకోవాలి? అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు శుభాకాంక్షలు తెలియజేయండి. ఆయన పడే కష్టాలను అర్థం చేసుకుని, ఆయన కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. నాన్నకు ఖరీదైన బహుమతులు అవసరం లేదు, మీరు కేటాయించే సమయమే ఆయనకు పెద్ద బహుమతి. ఆయనకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం లేదా ఆయనకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఆయన మనసును గెలుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆయన ఎంతో సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఫాదర్స్ డే అంటే కేవలం తండ్రులకే కాదు, తండ్రిలాంటి వారికి, తాతలకు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో తండ్రి పాత్ర పోషించే ప్రతి ఒక్కరికీ ఇది ముఖ్యమైన రోజు. తండ్రి చేసే నిశ్శబ్ద త్యాగాలను, ఆయన నిరంతర మద్దతును గౌరవిస్తూ, ఈ రోజును ఆయనకు ప్రత్యేకంగా ఉండేలా చూసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.