
తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన పెద్ద మనసు చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు.
ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న శ్రద్ధ అనే ఎనిమిదేళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల చివరి కోరికలను తీర్చే ‘మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ ప్రతినిధులు జూన్ 19న అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించగా.. ఆయన తన బిజీ షెడ్యూల్‌ను పక్కనపెట్టి వెంటనే స్పందించారు. ఆ చిన్నారితో జరిపిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన విజువల్స్‌ను అల్లు అర్జున్ పిఆర్ టీమ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ వర్చువల్ ఇంటరాక్షన్‌లో అల్లు అర్జున్ ఆ చిన్నారితో ఎంతో ఆప్యాయంగా హిందీలో మాట్లాడారు. శ్రద్ధను నవ్వుతూ పలకరిస్తూ.. తన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ డైలాగులను చెప్పమని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై ఒకేసారి ‘గడ్డం కింద చేయి తిప్పే’ (బియర్డ్-స్ట్రోక్) మేనరిజంను చేసి చూపించారు. చిన్నారి చేసిన ఆ క్యూట్ యాక్షన్‌ను చూసి బన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ ‘డ్యామ్ క్యూట్’ అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నావని అడగ్గా.. తాను డాక్టర్ అవుతానని ఆ బాలిక సమాధానమిచ్చింది. దాంతో సంతోషపడ్డ అల్లు అర్జున్.. శ్రద్ధను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సినిమా రంగానికి ఆవల కూడా నవ్వులను పూయించడమే తమ ఉద్దేశమని బన్నీ