
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: మతిస్థిమితం సరిగా లేని బాలిక(12)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగికి న్యాయస్థానం 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది.
జిల్లా కోర్టుల అనుసంధాన అధికారి పి.నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణవాసి వూసా వెంకటనారాయణ(84) ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. చైతన్యపురి ఠాణా పరిధిలో స్థిరపడ్డాడు. ఆయన 2023 మార్చిలో మతిస్థిమితం సరిగాలేని బాలికకు బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన బాలిక తండ్రి స్థానికుల సహాయంతో అతని వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పద్మావతి శుక్రవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.4 లక్షలు నష్టపరిహారం మంజూరు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.