నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ 'NBK 111'.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్ను విడుదల చేసింది.ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు (జూన్ 19) సందర్భంగా, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించిన వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పటికీ, చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా బర్త్‌డే పోస్టర్‌ను వదలడంతో సినిమాలో కాజల్ ఎంట్రీని మేకర్స్ ఖరారు చేసినట్లయింది.* టాలీవుడ్లో 'మురారి' బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్.. క్రేజీ మూవీతో సోనాలి బింద్రే రీ ఎంట్రీ! గంభీరంగా చందమామచిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. "అన్నీ కళ్లు ఆమె పైనే" (All Eyes On Her) అనే క్యాప్షన్‌తో పాటు "ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది" (Every Storm Has A Reason) అనే పవర్ఫుల్ లైన్‌ను జత చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లో కాజల్ లుక్ ఎంతో గంభీరంగా, వైవిధ్యంగా ఉంది. చీరకట్టులో, కళ్లజోడు ధరించి, ఒక ఆఫీస్ వాతావరణంలో నిలబడి ఉన్నట్లు చూపించిన ఈ లుక్‌లో ఆమె ముఖంలో ఉన్న సీరియస్ ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే ఆమె ఒక పవర్ఫుల్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జూన్ 10న 'ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా' (Entry of an Era) పేరుతో రిలీజ్ చేసిన ఈ చిత్ర గ్లింప్స్ బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించింది.* 'పెద్ది' కోసం 'గబ్బర్ సింగ్' త్యాగం.. రీ రిలీజ్ వాయిదా వేసిన బండ్ల గణేష్ బాలయ్య-కాజల్ క్రేజీ కాంబోనందమూరి బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఆ చిత్రంలో కాజల్ పోషించిన సైకాలజిస్ట్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ 'NBK 111' లో ఆమె కేవలం ప్రత్యేక పాత్రకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి ప్రధాన కథానాయికగా కనిపించనుంది. కథను మలుపు తిప్పే ఎంతో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను ఆమె పోషిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో మగధీర, డార్లింగ్, బృందావనం, చందమామ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లలో నటించిన కాజల్, ఈ మధ్య కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండటంతో సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ క్రేజ్ మరింతగా పెరిగింది.