
ఢిల్లీ వేదికగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మధ్య ఆసక్తికరమైన రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రతిపక్షాలను విమర్శించిన చంద్రబాబుకు శశి థరూర్ తనదైన శైలిలో ఓ డ్రైవర్ జీతం ఉదాహరణ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేవలం సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను ఎలా కోల్పోతాయో ఆయన వివరించారు.ఇటీవల ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని..
అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లను పెంచాలని ప్రతిపాదించారు. అయితే 2/3 వంతు మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రతిపక్షాలు అనవసరంగా వివాదం చేస్తున్నాయని.. అన్ని రాష్ట్రాల్లోనూ సమాన నిష్పత్తిలోనే 50 శాతం సీట్లు పెరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసినా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు.
ప్రభుత్వం త్వరలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిని మళ్లీ తీసుకువస్తుందని చంద్రబాబు మద్దతు పలికారు.చంద్రబాబు కామెంట్లపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించిన శశి థరూర్ ఓ ఇంట్రెస్టింగ్ ఉదాహరణను ఇచ్చారు. బాబు గారు.. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం.
మీ జీతం రూ.2 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ.20,000 అనుకుందాం. అందరికీ 50 శాతం జీతం పెంచుతున్నట్లు మీరు ప్రకటించారు. అప్పుడు మీ జీతం రూ.3 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ.30,000 అవుతుంది. ఇక్కడ పెరిగిన శాతంలో మార్పులేదు,, కానీ అంతకు ముందు కంటే ఇప్పుడు మీ ఆర్థిక స్థితి డ్రైవర్ కంటే చాలా మెరుగ్గా లేదు?
అని ప్రశ్నించారు.ఇదే సూత్రాన్ని లోక్ సభ సీట్లకు అన్వయిస్తూ.. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయని
ఢిల్లీ వేదికగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మధ్య ఆసక్తికరమైన రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రతిపక్షాలను విమర్శించిన చంద్రబాబుకు శశి థరూర్ తనదైన శైలిలో ఓ డ్రైవర్ జీతం ఉదాహరణ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను ఎలా కోల్పోతాయో ఆయన వివరించారు.ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని.. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లను పెంచాలని ప్రతిపాదించారు. అయితే 2/3 వంతు మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రతిపక్షాలు అనవసరంగా వివాదం చేస్తున్నాయని.. అన్ని రాష్ట్రాల్లోనూ సమాన నిష్పత్తిలోనే 50 శాతం సీట్లు పెరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసినా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం త్వరలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిని మళ్లీ తీసుకువస్తుందని చంద్రబాబు మద్దతు పలికారు.చంద్రబాబు కామెంట్లపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించిన శశి థరూర్ ఓ ఇంట్రెస్టింగ్ ఉదాహరణను ఇచ్చారు. బాబు గారు.. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. మీ జీతం రూ.2 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ.20,000 అనుకుందాం. అందరికీ 50 శాతం జీతం పెంచుతున్నట్లు మీరు ప్రకటించారు. అప్పుడు మీ జీతం రూ.3 లక్షలు, మీ డ్రైవర్ జీతం రూ.30,000 అవుతుంది. ఇక్కడ పెరిగిన శాతంలో మార్పులేదు,, కానీ అంతకు ముందు కంటే ఇప్పుడు మీ ఆర్థిక స్థితి డ్రైవర్ కంటే చాలా మెరుగ్గా లేదు? అని ప్రశ్నించారు.ఇదే సూత్రాన్ని లోక్ సభ సీట్లకు అన్వయిస్తూ.. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయని శశి థరూర్ వాదించారు. ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుంచి 120కి(40 సీట్లు పెరుగుదల) పెరిగి, కేరళ సీట్లు 20 నుంచి 30కి(10 సీట్లు పెరుగుదల) పెరిగితే.. నిష్పత్తి సమానంగా ఉన్నప్పటికీ రాజకీయ బలాబలాల్లో భారీ తేడా వస్తుందని చెప్పారు. యూపీకి అదనంగా 90 మంది ఎంపీల బలం వస్తే, కేరళకు కేవలం 10 మందే పెరుగుతారని, ఈ పొలిటికల్ వెయిట్ వ్యత్యాసం దక్షిణాది ముఖ్యమంత్రులకు పెద్ద ఆందోళనకరమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో సీట్ల పెంపును నిలిపివేయడంలో తన పాత్రను గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ప్రస్తుత బిల్లుకు మాత్రం పూర్తి మద్దతు ఇస్తుండగా, ప్రతిపక్షాలు, దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం దీనిని ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా భావిస్తున్నాయి.