తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయం.. దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడైనా ఊరిలో ఆలయం ఉంటుంది.. కానీ శ్రీరంగంలో మాత్రం ఆలయం లోపల ఊరు ఉంటుంది. అంటే ఆ ఆలయం ఎంత విశాలమైందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ శ్రీరంగం ఆలయ గోపురాలు చూస్తే..
చాలా పెద్దగా, ఎత్తుతో ఉంటాయి. అయితే అలాంటి శ్రీరంగం ఆలయం మన తెలంగాణలో కూడా ఉంది. తమిళనాడు శ్రీరంగం ఆలయాన్ని సందర్శించిన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు.. తన సామ్రాజ్యంలో కూడా అలాంటి ఆలయం ఉండాలని నిర్మించారు. అదే శ్రీరంగాపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం.
చెరువు మధ్యలో ఉండటం ఈ ఆలయ విశిష్ఠత. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్న ఈ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం.. చాలా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీరంగం ఆలయ స్ఫూర్తితో 18వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.
తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని సందర్శించి ముగ్ధుడైన శ్రీకృష్ణదేవరాయలు.. తన రాజ్యంలోనూ అలాంటి ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. శ్రీకృష్ణదేవరాయలు సంకల్పంతోనే ఈ ఆలయం రూపుదిద్దుకుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ప్రశాంతమైన చెరువు, పురాతన శిల్పకళ, వైష్ణవ ఆరాధనా సంప్రదాయాల కలయిక ఈ క్షేత్రాన్ని తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలబెట్టింది.ఈ శ్రీ రంగనాయక స్వామి ఆలయం రత్న పుష్కరిణి అనే కోనేరు మధ్యలో.. ఒక సుందరమైన ద్వీపం వలె ఉంటుంది.
ఈ ఆలయం అద్భుతమైన విజయనగర నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం.. శ్రీ రంగనాయక స్వామి (శ్రీ మహావిష్ణువు) ఆదిశేషునిపై శయనించి భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ రంగనాయకి తాయారు. ఈ ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
కిలోమీటర్ల దూరంలో.. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఆలయానికి సమీపంలో వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రోడ్డు మార్గంలో వనపర్తి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.ఆలయ ప్రత్యేకతలు శ్రీ రంగనాయక స్వామి ఆలయం చుట్టూ విశాలమైన చెరువు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గర్భగుడిలోని విగ్రహ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. దక్షిణ భారత వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణంలో విజయనగర, ద్రావిడ శైలుల ప్రభావం కనిపిస్తుంది. చెరువు మధ్యలో ఉన్న ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.శ్రీ రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలుప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడ సేవ, చక్రస్నానం వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.
ఈ ఆలయం వనపర్తి పట్టణానికి 25