
డ్రస్సింగ్ టేబుల్, బాత్రూమ్, లివింగ్ రూమ్.. ఇలా ఇంట్లో ఆయా గదుల్లో అద్దాలు ఏర్పాటుచేసుకుంటాం. అయితే వీటిపై దుమ్ము, ధూళి చేరడమే కాకుండా నీళ్ల మరకలూ పడుతుంటాయి. వీటిని తొలగించి అద్దాన్ని మెరిపించాలంటే కొన్ని చిట్కాలు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.
వేడినీటితో స్నానం చేయడం పూర్తయిన తర్వాత బాత్రూమ్లోని అద్దంపై పొగమంచులా ఒక పొర ఏర్పడుతుంది. ఈ నీటి మరకలు ఓ పట్టాన వదలవు. ఇలా జరగకుండా ఉండాలంటే.. స్నానానికి ముందే ఆ అద్దంపై షేవింగ్ క్రీమ్‌ను సన్నటి పొరలా పూయాలి. స్నానం పూర్తయ్యాక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచేస్తే ఫలితం ఉంటుంది.
కార్ల అద్దాలు, గ్లాస్ కిటికీలు.. వంటివి శుభ్రం చేయడానికీ ఈ చిట్కాను ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. ఇంట్లోని అద్దాన్ని శుభ్రం చేయడానికి చాలామంది సాధారణ నీటిని ఉపయోగిస్తుంటారు. అయితే దీనికి బదులు డిస్టిల్డ్ వాటర్‌ని ఉపయోగించడం మంచిదట.
ఈ నీటితో తుడవడం వల్ల అద్దంపై మరకలు, దుమ్ము, ధూళి.. వంటివి కూడా తొలగిపోతాయట. ఫలితంగా అద్దం తళతళలాడుతుందంటున్నారు నిపుణులు. ఇక ఈ నీటిని ఇతర క్లీనింగ్ ఉత్పత్తుల్లో కూడా కలుపుకొని వాడుకోవచ్చు. అద్దంపై పడిన జిడ్డు మరకల్ని తొలగించడానికి బేకింగ్ సోడా చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు.
ఇందుకోసం స్పాంజి లేదా ఒక శుభ్రమైన గుడ్డను బేకింగ్ సోడాలో అద్ది దాంతో అద్దంపై రుద్దాలి. ఆ తర్వాత దానిపై కొన్ని నీళ్లు చల్లి మరో శుభ్రమైన గుడ్డతో తుడిచేస్తే అద్దంపై ఉన్న మొండి మరకలన్నీ తొలగిపోయి తళతళా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.
తెల్లటి పేపర్లను ఉండలుగా చుట్టి, నీటితో తడిపి.. వీటితో అద్దంపై నెమ్మదిగా, గుండ్రంగా పై నుంచి కింది వరకు రుద్దుతూ రావాలి. ఫలితంగా అద్దంపై పడిన మరకలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వెనిగర్, నీరు కలిపిన మిశ్రమాన్ని ముందుగా అద్దంపై స్ప్రే చేసి..
పేపర్ని వాడుతుంటారు. కానీ తడి వల్ల ఆ పేపర్ ఇంక్ అద్దానికి అంటుకొని మరిన్ని మరకలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్లటి పేపర్ ఉపయోగించడం మంచిది. అలాగే అద్దం మూలల్ని కాటన్ స్వాబ్స్, మృదువైన టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
తర్వాత దాన్ని పేపర్‌తో శుభ్రం చేసినా సరిపోతుంది. అయితే ఈ క్రమంలో కొందరు న్యూస్