
మహిళల జీవనశైలిలో నెలసరి సర్వసాధారణమే అయినా.. ఇది వారి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో పలు దుష్ప్రభావాలూ తలెత్తుతుంటాయి. వాటిలో కడుపుబ్బరం ఒకటి. అప్పటికే కడుపునొప్పి, నడుంనొప్పితో ఇబ్బంది పడే వారికి ఈ సమస్య మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
మహిళల జీవనశైలిలో నెలసరి సర్వసాధారణమే అయినా.. ఇది వారి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో పలు దుష్ప్రభావాలూ తలెత్తుతుంటాయి. వాటిలో కడుపుబ్బరం ఒకటి. అప్పటికే కడుపునొప్పి, నడుంనొప్పితో ఇబ్బంది పడే వారికి ఈ సమస్య మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
మరి, నెలసరిలో ఇది సర్వసాధారణమా? అసలు ఎందుకొస్తుంది? దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?.. వంటి విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.. పిరియడ్స్ సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి రావడం ఎంత సహజమో.. చాలామంది కడుపుబ్బరంతో బాధపడడమూ అంతే సర్వసాధారణం అంటున్నారు నిపుణులు.
పొట్ట నిండుగా, నొప్పిగా అనిపించడం.. ఆకలి లేకపోవడం.. వంటి లక్షణాలు ఈ సమయంలో మనం గమనించచ్చు. అయితే నెలసరిలో ఈ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయంటున్నారు. ⚛ నెలసరి సమయంలో హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులొస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈస్ట్రోజెన్ స్థాయులు పెరిగి, ప్రొజెస్టరాన్ స్థాయులు తగ్గుతాయి.
ఫలితంగా జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. ఇది కడుపుబ్బరానికి దారితీస్తుందని చెబుతున్నారు. ⚛ అలాగే ఈ సమయంలో పొట్టలోని కండరాల పనితీరు మందగించడం వల్ల కూడా ఆహారం సులభంగా జీర్ణం కాదు. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం..
వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ⚛ పిరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రొస్టాగ్లాడిన్లు అనే రసాయనాలు గర్భాశయాన్ని సంకోచింపజేసి దాని లోపలి పొరను తొలగిస్తాయి. ఇది బ్లీడింగ్ రూపంలో బయటికి వస్తుంది. అయితే ఇవే రసాయనాలు పేగుల్నీ ప్రభావితం చేస్తాయట!
పాటించే ఆహారపుటలవాట్లు కూడా కడుపుబ్బరానికి దారితీస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పు-చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం నీటిని నిలుపుకొని ఉబ్బరంగా అనిపించచ్చు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, శీతల పానీయాలు కూడా సమస్యను తెచ్చిపెడతాయట.
⚛ పిరియడ్స్‌లో కొంతమంది ఒత్తిడి, నిద్రలేమితో సతమతమవుతుంటారు. దీనివల్ల కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నెలసరిలో కడుపుబ్బరం సాధారణ సమస్యే అయినా దీన్నుంచి ఉపశమనం పొందడానికి నిపుణులు కొన్ని చిట్కాల్ని సూచిస్తున్నారు.
⚛ నీళ్లు ఎక్కువగా తాగాలి. తద్వారా శరీరంలోని అధిక సోడియం బయటికి వెళ్లిపోయి నీటిని నిలుపుకోకుండా, కడుపుబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ ఉప్పు, చక్కెర, కొన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
⚛ ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు, ముడిధాన్యాలు.. నెలసరి సమయంలో తీసుకోవడం వల్ల అరుగుదల మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపుబ్బరానికి దూరంగా ఉండచ్చు.
⚛ కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, శీతల పానీయాలు కడుపులో గ్యాస్, ఉబ్బరానికి కారణమవుతాయి. కాబట్టి వీటిని పరిమితంగా లేదంటే పూర్తిగా తీసుకోకపోవడమే ఉత్తమం.
⚛ కడుపు పట్టేసినట్లుగా అనిపించినప్పుడు హీటింగ్ ప్యాడ్స్‌ని పొట్టపై కాసేపు ఉంచుకోవాలి. దీనివల్ల అక్కడి కండరాలు రిలాక్సై ఉపశమనం కలుగుతుంది. నొప్పీ తగ్గే అవకాశం ఉంటుంది.
⚛ కడుపుబ్బరాన్ని దూరం చేయడంలో నడక చక్కగా పనిచేస్తుంది. కాబట్టి భోజనం చేశాక పది నిమిషాల పాటు నడవాలి. ఈ అలవాటు ఆరోగ్యానికీ మంచిది.
⚛ ధ్యానం.. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా సుఖంగా నిద్ర పోవచ్చు. గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం.. వంటి సమస్యలు తలెత్తకుండానూ జాగ్రత్తపడచ్చు. అయితే ఇవన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడే సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోగలుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
ఇవి ఎక్కువగా విడుదలైన వారిలో కడుపుబ్బరం, కడుపునొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయట! మరికొంతమందిలో విరేచనాలూ అవ్వచ్చంటున్నారు నిపుణులు. ⚛ నెలసరి సమయంలో మనం