
Health Tips: 40 తర్వాత శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్స్ ఇవే.. ముందే గుర్తిస్తే జాగ్రత్త పడొచ్చు!
Health Tips: 40 తర్వాత శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్స్ ఇవే.. ముందే గుర్తిస్తే జాగ్రత్త పడొచ్చు!

Health Tips: 40 తర్వాత శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్స్ ఇవే.. ముందే గుర్తిస్తే జాగ్రత్త పడొచ్చు!

Health Tips: నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

Health Tips: కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

Morning Health Tips: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తే మీ ఆరోగ్యం గోవిందా!

బోసినోటితో చిన్నారి నవ్వుతున్నప్పుడు.. పొగిడినప్పుడు, పెరట్లో పూసిన గులాబీని చూసినప్పుడు.. మన ప్రమేయం లేకుండానే ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది.

Health Tips | పనసపండు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. దాని తియ్యటి రుచి, ప్రత్యేకమైన వాసన ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే పనసపండు తిన్న తర్వాత కొంతమంది గింజలను పడేస్తుంటారు. కానీ పనస గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఏ, సీ, ఈ, బీ విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.

Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

ఈ రోజుల్లో ఆఫీస్ పనులే కాదు, చాలామంది ఇంటి నుంచి కూడా ల్యాప్‌టాప్‌లపై గంటల తరబడి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కిందకు చూస్తూ ఉండటం మెడ, వెన్ను భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కేవలం ల్యాప్‌టాప్ వాడటం వల్లే వెన్నెముక దెబ్బతింటుందని కాదు… స్క్రీన్ ఎత్తు, కూర్చునే విధానం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం, విరామం లేకుండా పనిచేయడం వంటివే ప్రధాన కారణాలు. ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారికి మొదట్లో పెద్ద సమస్యగా కాకుండా కొన్ని చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మెడ పట్టేయడం, భుజాల నొప్పి, వీపు పైభాగంలో అసౌకర్యం, తలనొప్పి, పని పూర్తయ్యాక అలసటగా అనిపించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ లక్షణాలను పట్టించుకోరు కొందరు. అలా అయితే రోజువారీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా మెడ, వెన్నుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కళ్ల ఎత్తుకు దగ్గరగా ఉండేలా పైకి లేపండి. ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తే, వేరే కీబోర్డ్, మౌస్ వాడండి. వెన్నెముకకు తగిన సపోర్ట్ ఉండేలా కూర్చోండి. ఒకే భంగిమలో కాకుండా అప్పుడప్పుడు పొజిషన్ మార్చండి. ఎక్కువసేపు పనిచేసేటప్పుడు మధ్యలో చిన్న విరామాలు తీసుకుని శరీరాన్ని కదిలించండి. స్క్రీన్‌ను చూడటానికి ముందుకు వంగడం తగ్గించండి. ఎక్కువసేపు పనిచేసిన తర్వాత మెడ కొద్దిగా పట్టేయడం సాధారణమే. కానీ, నొప్పి తగ్గకుండా పెరుగుతున్నా, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు బలహీనపడటం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని వాడే పద్ధతిని మార్చుకోవడం ముఖ్యం. స్క్రీన్‌ను సరైన ఎత్తులో ఉంచడం, వెన్నెముకకు సపోర్ట్ ఇవ్వడం, బయటి కీబోర్డ్, మౌస్ వాడటం, మధ్యమధ్యలో లేచి నడవడం వంటి చిన్న అలవాట్లు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు శారీరక శ్రమను

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని