
PM Kisan Beneficiary List: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. అయితే, పీఎం కిసాన్ 23వ విడుత నిధులు పొందాలంటే ముందుగా ఈకేవైసీ పనులు పూర్తి చేసుకోవాలి.
అంతేకాదు లిస్ట్‌లో మీ పేరు ఉందా? స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సొంత వ్యవసాయ భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది రూ.6000 లబ్ది పొందుతున్నారు. అయితే, అనర్హులను గుర్తించే పనిలో పడింది కేంద్రం పడింది.
వారి పేర్లను పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగించారు. పీఎం కిసాన్ నిధులు రూ.6000 రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది జమ అవుతాయి. నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 మూడు వాయిదాల్లో పొందుతారు. ఈ పీఎం కిసాన్ 23వ విడుత జూన్ 20వ తేదీన జమ అవుతున్నాయి.
కొత్తగా పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకునేవారు pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మర్ కార్నర్ ఎంచుకుని అప్లై చేయవచ్చు. అయితే, సరైన భూరికార్డులు కలిగి ఉండాలి. దీంతోపాటు ఆధార్ కార్డు, భూ రికార్డులు, బ్యాక్ పాస్బుక్కు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేశారు.
అయితే, ఈ పీఎం కిసాన్ జాబితా నుంచి మీ పేరు తీసేశారా? లేదా ఉందా? అని అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి హోంపేజీలో ఫార్మర్ కార్నర్ ఎంపిక చేసుకుని బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేయండి.
ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, గ్రామం కూడా ఎంపిక చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అర్హులైన జాబితా కనిపిస్తుంది
.