
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బలమైన పోర్చుగల్ జట్టుకు పసికూన కాంగో కోలుకోలేని షాకిచ్చిందని చెప్పాలి. మ్యాచ్ ఆరంభంలోనే తిరుగులేని ఆధిక్యాన్ని సాధించినప్పటికీ, దానిని కాపాడుకోవడంలో పోర్చుగల్ ఘోరంగా విఫలమైంది.
పట్టుదలతో పోరాడిన కాంగో ఆటగాళ్లు పోర్చుగల్ డిఫెన్స్‌ను ముక్కలు చేస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో దారుణంగా ఫ్లాప్ అవ్వడం ఫుట్‌బాల్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే పోర్చుగల్ తన క్లాసిక్ గేమ్ ప్లాన్‌తో మైదానంలో విరుచుకుపడింది. మిడ్ఫీల్డర్ల అద్భుతమైన సమన్వయంతో బంతిపై పూర్తి కంట్రోల్ సాధించి, కాంగో గోల్ పోస్ట్‌పై వరుస దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఒక సూపర్బ్ ఫీల్డ్ మూవ్‌తో గోల్ సాధించి పోర్చుగల్ 1-0తో ముందంజ వేసింది.
అయితే.. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. లీడ్ సాధించిన తర్వాత పోర్చుగల్ డిఫెన్స్ లైన్ రిలాక్స్ అవ్వడం, కాంగోకు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫ్యాన్స్ అందరూ రొనాల్డో మ్యాజిక్ కోసం కోటి ఆశలతో ఎదురుచూశారు. కానీ, మైదానంలో రొనాల్డో ఏమాత్రం ప్రభావం చూపించలేదు.
కాంగో డిఫెండర్లు రొనాల్డోను పూర్తిగా మార్క్ చేసి, అతనికి బంతి అందకుండా అడ్డుకున్నారు. లభించిన ఒకటి రెండు సులభమైన అవకాశాలను కూడా రొనాల్డో గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యాడని చెప్పాలి. టార్గెట్ వైపు అతను కొట్టిన షాట్లు మిస్ అవ్వడం, మ్యాచ్‌లో అతని పేలవమైన ఫామ్‌కు అద్దం పట్టింది.
జట్టు ఏమాత్రం బెదరకుండా కౌంటర్ ఎటాక్స్‌తో పోర్చుగల్‌కు ముచ్చెమటలు పట్టించింది. సెకండ్ హాఫ్‌లో సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగిన కాంగో, పోర్చుగల్ రక్షణ శ్రేణిలో ఉన్న లోపాలను అద్భుతంగా వాడుకుంది. మ్యాచ్ ముగిసే సమయానికి స్కోరును సమం చేసి, పోర్చుగల్ నోటి కాడి ముద్దను లాగేసుకుంది. ఈ డ్రాతో పోర్చుగల్ కీలకమైన పాయింట్లను కోల్పోయింది. కాంగో ఆటగాళ్లు మాత్రం విజయం సాధించినంత సంబరాల్లో ఎగిరిగంతేశారు. కాగా రొనాల్డో ఫ్లాప్ షోపై సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. నెక్ట్స్ మ్యాచ్‌ల్లోనైనా పోర్చుగల్ పుంజుకుంటుందో లేదో చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
: మరోవైపు.. కాంగో