
Hyderabad power cut:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జూన్ 18, 2026 నాడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. నగరం వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఈ పవర్ కట్ అమలు కానుంది.
హస్తినాపురం, ఆస్మాన్‌ఘడ్, అబ్దుల్లాపూర్‌మెట్, చిక్కడపల్లి, మల్కాజిగిరి, నేరేడ్మెట్, ఉప్పల్, మౌలాలి, సైనిక్‌పురి డివిజన్ల పరిధిలో విద్యుత్ నిలిపివేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.
కాబట్టి స్థానిక ప్రజలు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ ప్రాంతంలో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో లేదా ఎప్పుడు పోతుందో గమనించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాము. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ లేని సమయంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
Read also: CA Final Result May 2026: ICAI CA నేడే ఫలితాల విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే! హస్తినాపురం డివిజన్ పరిధిలో గాయత్రీనగర్, గాయత్రీ హోమ్స్, దేవి గాయత్రీనగర్, శ్రీ గాయత్రీనగర్, వెంకటసాయి కాలనీ, జిల్లెలగూడ విలేజ్‌లలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదు.
నందీహిల్స్ ఫీడర్ పరిధిలోని టీచర్స్ కాలనీ, నాగార్జున కాలనీ, చైతన్యహిల్స్, నందీహిల్స్ రోడ్, శిగంగాహిల్స్, ప్రశాంత్‌హిల్స్‌లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తారు. ఆస్మాన్‌ఘడ్ పరిధిలో సైదాబాద్ కాలనీ, దిల్సుఖ్నగర్, పల్టన్, ధర్మవంత్ కాలేజ్, జీఎం నగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు వేర్వేరు కాలనీల్లో పవర్ కట్ ఉంటుంది.
అబ్దుల్లాపూర్‌మెట్, ఇనాంగూడ, కవాడిపల్లి, ఇండస్ర్టీరియల్, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం కలుగుతుంది. చిక్కడపల్లి, ఆజామాబాద్ డివిజన్ల పరిధిలో ఏవీ కాలేజ్, గగన్‌మహల్, మీరా థియేటర్, లక్డీకాపూల్, కింగ్‌కోఠి, శంకర్ మఠ్
, సాయిబాబా టెంపుల్, నవీన్‌నగర్, ఎర్రమంజిల్, అంబేడ్కర్‌నగర్, లిటిల్ ఫ్లవర్, బ్రాహ్మణ్ హాస్టల్, ఇందిరానగర్, రామ్ నగర్, నల్లకుంట, గాంధీకుటీర్, కేశవ్ మెమోరియల్ ప్రాంతాల్లో పనులు జరుగుతాయి.
మల్కాజిగిరి, వినాయకనగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్, శ్రీకృష్ణానగర్, సీతారాంనగర్, సైనిక్‌నగర్, రామబ్రహ్మనగర్, దేవీనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదు. నేరేడ్మెట్ బృందావన్ కాలనీ పరిధిలో సప్తగిరి, జీకే కాలనీ, ప్రేమ్‌నగర్, వివేకానందపురం, మాతృపురి, రాఘవేంద్రనగర్ కాలనీల్లో ఇదే సమయం వర్తిస్తుంది. ఉప్పల్ భగాయత్ పరిధిలో ఎల్ఎన్ నగర్ ఫీడర్ ద్వారా భారత్‌నగర్, బాలాజీ నగర్, చైతన్య భారతి స్కూల్ లేన్, రాజేంద్ర నగర్, టీవీ కాలనీ, గాంధీ నగర్, చర్చ్ కాలనీ, శ్రీరామపురం, అరవింద నగర్, నేతాజీ నగర్, జనప్రియ అపార్ట్మెంట్లలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు పవర్ ఉండదు. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సాయికృష్ణ కాలనీ, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, వెంకటసాయి నగర్, బాలకృష్ణ నగర్, శ్రీరామ కాలనీ, వెంకటేశ్వరస్వామి ఆలయ వీధి, గాంధీనగర్ రోడ్ నం.3, శ్రీనగర్ కాలనీ హనుమాన్ ఆలయ వీధిలో సరఫరా నిలిపివేస్తారు. మౌలాలి, సైనిక్‌పురి పరిధిలోని కృష్ణానగర్, వెంకటేశ్వరనగర్, హస్తినాపురి, సాయిపురి, హెచ్ఎంటీ బేరింగ్స్ ఆఫీసర్స్ కాలనీ, నిర్మల్‌నగర్, విజయపురి, ఆయోధ్యనగర్, రుక్మిణిపురి, త్యాగరాయనగర్ ప్రాంతాల్లో మరమ్మతులు జరగనున్నాయి.
Lord Sri Rama in Bangladesh: ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Medchal Tragedy: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
CA Final Result May 2026: ICAI CA నేడే ఫలితాల విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే!
Tesla in Hyderabad: హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Telangana Clean Energy Summit 2026: రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్
ACB Raids : తెలంగాణలో ఏసీబీ దాడులు – అవినీతి అధికారిపై కేసు నమోదు, ఆస్తుల విలువ రూ. 100 కోట్లు!