
మెడిసిన్ చదివిన ప్రియా శెట్టి తన తల్లిదండ్రుల మద్దతుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ తక్కువ వారాల్లోనే ఈ అమ్మడు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియ.
నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే అగ్ని పరీక్ష షో గురించి పలు విషయాలు వెల్లడించింది. మీరు సింగిలా లేదా ఆల్రెడీ కమిట్ అయ్యారా అని యాంకర్ అడగ్గా..
లేదు సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ గురించి వెల్లడించింది. తాను కొంచెం ఎక్కువగా కేర్ చేస్తానని.. అలాగే ఎక్కువగా ప్యాంపర్ చేస్తానని తెలిపింది. అంతేకాకుండా తాను చాలా రొమాంటిక్ అని చెప్పుకొచ్చింది ప్రియా శెట్టి.
ఇక తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ మాత్రం లోకమందరికీ విలన్ లా ఉండాలని.. కానీ తన దగ్గరకు వచ్చేసరికి హీరోలాగా ఉండాలని సరదాగా చెప్పుకొచ్చింది ప్రియా. తనకు డార్క్ అబ్బాయిలు చాలా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ప్రియా శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
అలాగే ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి..
ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్