
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, పలు ఆసక్తికరమైన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్టార్ హీరోయిన్ తో జరిగిన ఓ గొడవ గురించి మాట్లాడారు, అలాగే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి విశిష్టమైన దర్శకత్వ శైలి వంటి అనేక విషయాలను పంచుకున్నారు.
దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆవేశం అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో హీరోయిన్ నగ్మాతో గొడవ జరిగినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ..
చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు నగ్మాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తగిన గౌరవం లభించడం లేదని భావించి, ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. "తనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని, విష్ చేయకపోతే షూటింగ్‌కి రాను" అని నగ్మా చెప్పారని, దీనితో తామంతా కూడా అప్పటి వయసులో కాస్త దూకుడుగా ఉండేవాళ్లమని, ఆమె గొడవ చేసిన తర్వాత నుంచి ఆమె వస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వంటివి చ్చేసి ఆమెను కావాలని రెచ్చగొట్టామని దేవి ప్రసాద్ అన్నారు.
ఈ గొడవ చివరికి పెద్దదై సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిలిం అసోసియేషన్ ఫిర్యాదు చేస్తాం అని చెప్పాం.. ఆ తర్వాత నగ్మా గారు షూటింగ్ కు తిరిగి వచ్చారని, సమస్య సామరస్యంగా పరిష్కరించబడిందని ఆయన వివరించారు. ఈ మొత్తం సంఘటనలను ఆ వయసులో ఉండే "పిల్లతనం, కుర్రతనం" కారణంగా జరిగినవిగా దేవి ప్రసాద్ అభివర్ణించారు.
ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.? అంతేకాకుండా, దేవి ప్రసాద్ గురువు గారుగా పేర్కొన్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నటులను
ఎంపిక చేసే విధానం గురించి వివరించారు. ఆయనకు ఆహార్యం ఉంటే చాలని, నటన వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కాదని తెలిపారు. ఆడిషన్స్, డైలాగ్ చెప్పడం వంటివి లేకుండా, ఒక పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలని అనిపిస్తే, వారిని నేరుగా కెమెరా ముందు నిలబెట్టి, తనే మొత్తం చెప్పి నటింపజేసేవారని దేవి ప్రసాద్ అన్నారు. కొత్త నటుల కారణంగా ఎక్కువ టేకులు వెళ్లినా, సీనియర్ నటులు ఎప్పుడూ ప్రశ్నించేవారు కాదని, బదులుగా కొత్తవారికి సహకరించేవారని ఆయన పేర్కొన్నారు. అలాగే, తన నటన ప్రవేశం గురించి దేవి ప్రసాద్ మాట్లాడుతూ, మొదట్లో చిన్న పాత్రలు చేయడానికి ఇష్టపడలేదని, కానీ నీది నాది ఒకే కథ చిత్రంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక హీరో పాత్ర లాంటిది ఆఫర్ చేయడంతో, 23-24 రోజుల షూటింగ్‌కు అంగీకరించి నటుడిగా మారానని దేవి ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి