స్నానం చేసే నీటిలో తేనె యాడ్ చేయండి. ఇది చర్మానికి తేమ అందిస్తుంది. తేనె కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. స్నానం చేసే నీటిలో ఓట్మీల్ కలపండి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మం తేమగా ఉంటుంది. ఓట్మీల్ కలిపిన నీటితో స్నానం చేస్తే మృతకణాలు తొలగుతాయి.
స్నానం చేసిన నీటిలో పాలు కలపండి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్నానం చేసిన నీటిలో కొబ్బరి నూనె కలపండి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి.
ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేస్తే శరీరం డీటాక్స్ అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందం రెట్టింపు అవుతుంది. నీటిలో రోజ్‌వాటర్ కలిపి స్నానం చేయండి. దీంతో చర్మం పీహెచ్ విలువ బ్యాలెన్స్ అవుతుంది. చర్మంపై ఎరుపుదనం తగ్గుతుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ కలిపిన నీటితో స్నానం చేస్తే నల్ల మచ్చలు తగ్గుతాయి. అందం రెట్టింపు అవుతుంది. స్నానం చేసిన నీటిలో పసుపు కలపండి. ఇందులోని కర్కుమిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
నల్ల మచ్చలను మాయం చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేస్తే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది
.