
ఇంటర్నెట్ డెస్క్: ఓ వైపు ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ తన తొలి మ్యాచ్లోనే లియోనెల్ మెస్సి హ్యాట్రిక్ కొట్టాడు. కానీ, క్రిస్టియానో రొనాల్డో మాత్రం కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. డిఆర్ కాంగోతో మ్యాచ్ను పోర్చుగల్ 1-1తో డ్రా చేసుకుంది.
దీంతో అతడు చర్చనీయాంశంగా మారాడు. ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ బరిలోకి దిగిన రొనాల్డోపై భారీగానే అంచనాలు ఉన్నాయి. కానీ, వాటిని అందుకోవడంలో విఫలమై నిరాశపరిచాడు. రెండుసార్లు గోల్ కొట్టే అవకాశం వచ్చినా సాధించలేకపోయాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.
‘‘మేం అనుకున్నవిధంగా ఆరంభం దక్కలేదు. అయితే, ఇంకా ముగిసిపోలేదు. తల ఎత్తుకొని.. తదుపరి మ్యాచ్ కోసం సిద్ధం కండి’’ అని పోస్టు చేశాడు. మున్ముందు మ్యాచుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పరోక్షంగా విమర్శకులకు సమాధానం ఇచ్చినట్లైంది.
పోర్చుగల్ - డీఆర్ కాంగో మ్యాచ్ సమయంలో కొందరు అభిమానులు అర్జెంటీనా స్టార్ మెస్సి పేరును పెద్దగా అరవడం గమనార్హం. రొనాల్డో కేవలం తాను సొంతంగా గోల్స్ సాధించడం పైనే దృష్టిపెట్టకూడదని.. సహచరులకూ సహకరించాలని ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్లేయర్ థీర్రే హెన్రీ సూచించాడు.
‘‘జట్టుకు గోల్స్ అవసరం. రొనాల్డోనే గోల్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఇక్కడ మాత్రం అతడే గోల్స్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ క్రమంలో బ్రూనో ఫెర్నాడేజ్ మార్గంలోకి వెళ్తున్నాడు’’ అని హెన్రీ విమర్శించాడు. డీఆర్ కాంగోపై బ్రూనోనే ఒక్క గోల్ కొట్టాడు.
తాము చూసిన గత రొనాల్డో ఈ మ్యాచ్లో కనిపించలేదని డీఆర్ కాంగో మిడ్ ఫీల్డర్ ముకావు వ్యాఖ్యానించాడు. ‘‘రొనాల్డో పరుగులోనూ వేగం లేదు. మాకు తెలిసిన రొనాల్డో ఇతడు కాదు. ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. మా డిఫెన్స్ కూడా అతడిని ఈజీగానే అడ్డుకోగలిగింది.
: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మా కుర్రాళ్లు చక్కగా ఆడారు. విజయం కోసం రొనాల్డో పెద్దగా ప్రయత్నించలేదు’’ అని ముకావు తెలిపాడు. గమనిక