
Elon Musk : భారతదేశంలోనే కాదు యూరప్ తోసహా అనేక దేశాల్లో కాక్రోచ్ పుట్టలను సృష్టించిన చరిత్ర ఎలాన్ మస్క్. పారిస్ నుంచి ఢిల్లీ వరకూ, బ్రస్సెల్స్ నుంచి మలేషియా వరకూ అన్నిదేశాలూ మస్క్ వల్ల ఎదోరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
అనేక దేశాలు మస్క్ ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను నిషేధించాయి. ఎఐ వేదిక గ్రోక్ ద్వారా ప్రముఖులు అశ్లీల వీడి యోలు చేసి అపఖ్యాతిపాలు చేయ డం. ఇదే ఎలైన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల అజెండా. ప్రముఖులు ఎప్పుడు తన దుష్ప్రచారానికి దొరుకు తారా అని ఎదురుచూస్తున్న మనక్‌కు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు అవకాశంగా దొరికాయి.
అయితే ఆయన తన ఉద్దేశ్యం గురించి వివరణ కూడా ఇచ్చారు. ఎక్స్ వేదికగా అభిజీత్ దీప్కే అకౌంట్ ఓపెన్ చేయడం రెండు లక్షల ఫాలోవర్స్ రావడం రాత్రికి రాత్రి జరిగిపోయింది. మొదట ఎక్స్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజీత్ దీప్కే అకౌంట్ ఓపెన్ చేయగానే ఫాలోయర్లు రెండు లక్షల మందికి పెరిగిపోయారు.
అసాధారణం గా ఫాలోయర్లు పెరగడం, మరో వైపు, వివాదానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర బిందువు కావడంతో భారత దేశ హోం శాఖ అప్రమత్తమై ముందు జాగ్రత్తగా అకౌంట్‌ను తాత్కాలికంగా సీజ్ చేయించింది. తర్వాత దీని వివరాలు తెలుసుకుని అకౌంట్‌ను కొనసాగించడానికి అనుమతించారు.
Read Also : Modi and Meloni:మనం ఇన్‌స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్! కాక్రోచ్ జనతా పార్టీ సీజ్ కావడంతో కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో ఎక్స్ లోనే మరో అకౌంట్‌ను అభిజీత్ ప్రారం భించాడు. మస్క్ ఎక్స్ వ్యవహార శైలిపై ఇప్పటికే దేశంలో అనేక ఫిర్యాదులున్నాయి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే పోస్టులను తొలగించాలని సహాయోగ్ సెన్సార్ విభాగం కోరినా మస్క్ ఎక్స్ ఖాతరు చేయలేదు. దీనితో మస్క్ ఎక్స్‌కు హోం శాఖ ఈ ఏడాది
జనవరి రెండోతేదీన నోటీసులు జారీ చేసింది. ఆ కడుపు మంటతోనే మస్క్ కాక్రోచ్ ఉద్యమానికి భారీ ప్రచారాన్ని ఇచ్చినట్టు అనుమా నిస్తున్నారు. భారత హోంశాఖ ఫేక్ ఫాలోయర్స్ పై విచా రణ మొదలు పెట్టడంతో ఎక్స్‌పై ప్రభుత్వ చర్య ప్రారంభం అవుతుందన్న అనుమానంతో కావచ్చు. అకౌంట్‌ను ఇన్‌స్టా గ్రామ్క మార్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పది రోజుల్లో రెండు కోట్ల మంది ఫాలోయర్స్ చేరారు. ఇది అసాధారణమైన పెరుగుదలగానే సైబర్ని పుణులు భావిస్తున్నారు. సాధార ణంగా కంపెనీల మార్కెటింగ్ కుట్రలు, కుతంత్రాలకు ఉప యోగించే బోట్ నెట్ వర్క్‌లు, ఎక్స్మేటా డేటా సెంటర్లు అల్ గోరథమ్స్ ప్రమోషన్ ద్వారా ఫేక్‌లతో ఫాలోయర్ల సంఖ్య అసాధారణంగా పెంచుతారు. ఎలాన్ మస్క్, ట్రంప్ లాంటి వారు కావాలనుకుంటే డేటా సెంటర్లలోనే ఆలో రిథమ్స్ మాయ చేయడం కష్టమేమీ కాదు. ఇటువంటి కుట్రల కోసమే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను అమెరికా ఉపయోగిం చుకుంటోంది. బోట్ నెట్ వర్క్ లు, ఆటో కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ లేకపోతే పది రోజుల్లో కోటి నలభై లక్షల ‘వర్టికల్ గ్రోత్’ సాధ్యం కాదని సైబర్ నిపుణుల అంచనా.
దేశ రాజధానిలో జరిగిన కాక్రోచ్ల నిరసన ప్రదర్శన రెండు వాస్తవాలను తేటతెల్లం చేస్తోంది. ఒకటి ఇండిగో, నీట్ లాంటి జాతీయ విపత్తులు సంభవించినా భాధ్యులైన మంత్రులపై చర్యలు తీసుకోని ప్రధాని నరేంద్ర మోడీ మొండి స్వభావం. రెండు దేశంలోని కీలకమైన, సమస్యలను ఆధారం చేసుకుని అస్థిరత సృష్టించడానికి విదేశీ శక్తుల ప్రయత్నం. కోట్లాది మంది ప్రజలను క్షోభకు గురిచేసే పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం తప్పున్నర. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, ఇతర దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రజలకు సంబంధిం చిన డేటా చోరీలు చేయడం ఎలాన్ మస్క్ అసలు వ్యాపారం. ఈ కారణంగానే ఆయన నడుపు తున్న ఎక్స్ ఎఐ గ్రోకో నును అనేక దేశాలు నిషేధించాయి. భారత ప్రభుత్వంతో కూడా మస్క్ ఎక్స్‌కు తీవ్రమైన విభే దాలున్నాయి. సోషల్ ప్రపంచ వ్యాప్తంగా ఎలెన్ మస్క్ హీనమైన, అరాచకమైన చర్యల గురించి కొంచెం మీడియా లతో బాటు అన్ని ఆన్ లైన్ ఛానల్స్‌లో ప్రసారం చేసే సమాచారాన్ని భారత ప్రభు త్వ సంస్థ సహయోగ్ సెన్సార్ చేస్తుంది.
చట్ట, ప్రజావ్యతి రేకసమాచారం ఉంటే దీన్ని వెంటనే తొలగించమని సహ యోగ్ కోరుతుంది. సోషల్ మీడియాలకు, ఇతర సంస్థలకు నోటీసులు ఇస్తుంది. ఇలా నిబంధనలు విధించడం మస్కు ఇష్టం లేదు. ఎలాన్ మస్క్ టెస్లా, స్టార్‌లింక్ వంటి తన ఇతర వ్యాపారాలను భారత దేశంలోకి విస్తరించాలని భావిస్తున్నాడు. భారత రాజ్యాం గాన్ని గౌరవించని ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫాంను అనుమతిం చబోమని భారత్ తెగేసి చెప్పింది. భారత చట్టాలకు లోబడి పని చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలకు అనుమతులొచ్చాయి. బ్లూ టిక్ ప్రీమియం బాడ్జిల పేరుతో యూజర్లను మోసం చేస్తూండటంతో డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డిఎస్ ఎ) కింద యూరోపియన్ యూనియన్ మస్క 1500 కోట్ల రూపా యల జరిమానా విధించింది. వినియోగదారుల అనుమతి తీసుకోకుండా 6కోట్ల మందికి పైగా యూరోపియన్ విని యోగదారుల వ్యక్తిగత పోస్టులను మస్క్ గ్రోక్చౌర్యం చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఎక్స్ అల్గారిథమిక్ మోసాలు, డీప్ ఫేక్‌లపై ఫ్రాన్స్, భారతదేశం, మలేషియా, టర్కీలలో విచారణ జరుగుతోంది. బాలల పోర్న్వీడియో లు, ఎఐతో బ్లూ ఫిలింలు చేసి ప్రసారం చేయడం, హింసా త్మకమైన తీవ్రవాద సంస్కృతిని ప్రోత్సహించే వీడి యోలు ప్రసారం చేయడంపై కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఎంతో స్నేహితు లమని చెప్పుకునే అరబ్ దేశాలు కూడా మస్క్స్ ను తమ దేశాల్లో అడుగుపెట్లనీయడం లేదు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగానే మస్క్ పాల్గొంటాడనే కారణంగానే అనేక దేశాలు ఎక్స్‌ను బహిష్కరిస్తున్నాయి.
Adarsha Kutumbam Movie: త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ లో భారీ మార్పులు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Congress On Amit Shah : ‘ఆపరేషన్ ఆకర్ష్’పై అమిత్ షాపై కాంగ్రెస్ నిప్పులు
Private education : సామాన్యుడికి భారంగా ప్రైవేట్ చదువు!
US Drops Indo Command: భారత్‌కు అమెరికా భారీ షాక్.. ‘ఇండో పసిఫిక్’ పేరు మారుస్తూ సంచలన నిర్ణయం!
Bombay High Court: దివంగత భర్త ఆస్తి నుండి మాజీ భార్యకు భరణం పొందే హక్కు ఉంది : బాంబే హైకోర్టు