
Deputy CM Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్ కోరికను నెరవేర్చిన అనంతరం, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు.
ఈ పర్యటనకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Read Also : Andhra Medical Collage : పీజీ విద్యార్థులను వేధించినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సస్పెండ్ కొద్ది రోజుల క్రితం హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ..
తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తూ చేసిన వీడియోను చూశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ వీడియో చూసిన వెంటనే అతని కోరికను నెరవేర్చాలని భావించి, ఈ రోజు నేరుగా అతని నివాసానికి వెళ్లినట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు ఎంతో ప్రశంసనీయమని, అది అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అని పవన్ కల్యాణ్ ప్రార్థించారు. ఈ రోజు జరిగిన తన వరంగల్, హనుమకొండ పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు తనపై
చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చాటుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని, ఆ మమకారాన్ని జీవితాంతం తన హృదయాంతరాల్లో నిలుపుకొంటానని భావోద్వేగానికి లోనయ్యారు. చివరగా, “ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను” అంటూ తన ప్రియతమ అభిమానికి ధైర్యం చెప్పారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
AP Politics: “అనిత గొంతు నొక్కలేరు”: వైసీపీకి లోకేశ్ షాకింగ్ వార్నింగ్!
Nellore Family Suicide Case : నెల్లూరు జిల్లాలో ఘోరం: ‘దూకెయ్ నాన్నా’ అంటూ కొడుకును ఉరి తీసిన తండ్రి
Andhra Medical Collage : పీజీ విద్యార్థులను వేధించినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సస్పెండ్
Kalyandurgam: ఆ హామీ నెరవేర్చాకే ఓట్లు అడుగుతా:ఎమ్మెల్యే సురేంద్రబాబు
Nellore crime news: ముత్తుకూరులో వృద్ధుడి దారుణ హత్య
Nara Lokesh Challenge YS Jagan: జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్