
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అక్కడ వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని, హర్మూజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు.
ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.