
వాట్సాప్ నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ ఐఓఎస్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ వివరాలు రివీల్ అయ్యాయి. అయితే, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ అందుబాటులోకి రాలేదు. సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకుండా యూజర్లకు మరింత కంట్రోలింగ్ ఇవ్వాలని వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకువస్తోంది.
Read Also : PF withdrawal : PF డబ్బులు కావాలా? ఫస్ట్ మీ EPFO ఖాతాలో ఈ డిటైల్స్ చెక్ చేసుకోండి.. లేదంటే పైసా కూడా రాదు..! ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది? : నివేదికల ప్రకారం.. వాట్సాప్ యూజర్లు మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్‌ను ఎక్కువసేపు ట్యాప్ చేసి పట్టుకుంటే చాలు..
ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వారికి ‘Send As View Once’అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీ మెసేజ్ పంపే వ్యక్తికి ఒక్కసారి మాత్రమే చదివే ఫార్మాట్లో పంపవచ్చు. అవతల వ్యక్తి మీ మెసేజ్ ఒకసారి చూశాక అదృశ్యమవుతుంది. ఆ తర్వాత మళ్లీ చూడలేరు.
ఫోటోలు, వీడియోల కోసం ‘వ్యూ వన్స్’ ఫీచర్ మాదిరిగానే మెసేజ్ చూసిన వెంటనే కాపీ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం చేయలేరు. మెసేజ్ సేవ్ కూడా చేయలేకపోవచ్చు. స్క్రీన్షాట్లు, స్క్రీన్ రికార్డింగ్లపై కూడా లిమిట్స్ ఉండొచ్చు. ఈ ఫీచర్ పర్సనల్ గ్రూప్ చాట్లు రెండింటిలోనూ వర్క్ అవుతుంది.
అయితే, ఛానెల్‌లలో అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన ఏ వివరాలనూ కంపెనీ ఇంకా వెరిఫై చేయలేదు
.