
భువనగిరి అర్బన్, జూన్ 16 : భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్‌లో గల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ)ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన అడ్మిషన్ల వివరాలు, ఎన్ని కొత్త అడ్మిషన్లు వచ్చాయని, విద్యార్థినుల హాజరు శాతం ఎలా ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. రిపేర్ పనులు నెమ్మదిగా సాగుతున్న విషయంపై ఆరా తీసి ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
పాఠశాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేసి అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, పప్పు కూరగాయలునాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంట నూనె ప్యాకెట్లపై ఉన్న గడువు తేదీలను పరిశీలించి, కాలపరిమితి ముగిసిన వస్తువులు వినియోగించరాదని సూచించారు.
పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం పేరుకుపోకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అదేవిధంగా పట్టణంలోని బాగా ఏర్పాటు చేయాలని పరిశీలించి విద్యార్థుల వసతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులు చేయించారు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యాధికారి భిక్షపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
.