
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ భద్రతకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జోక్యం చేసుకోకుంటే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమయ్యేదని అన్నారు. లెబనాన్ విషయంలో ఆ దేశం (Israel) అనుసరిస్తున్న తీరుతో సంతోషంగా లేనని చెప్పారు.
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వచ్చిన ట్రంప్.. ఖతార్ ఎమిర్‌తో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ అంశంలో నెతన్యాహు (Benjamin Netanyahu) మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘బీబీ (నెతన్యాహు)తో నాకు మంచి అనుబంధం ఉంది.
లెబనాన్ విషయానికొస్తే ఆయన బాధ్యతగా ఉండాలి. ఆ దేశం (Lebanon) ఒకప్పుడు గొప్ప దేశంగా ఉండేది. ప్రొఫెసర్లు, వైద్యులు, లాయర్లు ఉండే దేశం. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లెబనాన్, హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరి నాకు నచ్చలేదు.
ఇప్పటికే ఆ ఒప్పందం పూర్తి కావాల్సింది. కానీ, అంతులేకుండా సాగుతూనే ఉంది’’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌తో కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 42వేల మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు.
గతవారం ఇరాన్‌పై జరిపిన దాడులను ప్రస్తావించిన ట్రంప్.. మరో మార్గం లేకనే దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. తాజా ఒప్పందం న్యాయమైందని అభివర్ణించారు. అయితే, ఒప్పందంలో భాగంగా ఇరాన్లో అమెరికా పెట్టుబడులు పెట్టనుందని వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు.
మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం పశ్చిమాసియాలో సానుకూల వాతావరణానికి మార్గం సుగమం చేస్తుందని ఖతార్ ఎమిర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు