
ఉత్తరాఖండ్‌కు చెందిన 30 ఏళ్ల శంషేర్ సింగ్ పుట్టుకతోనే చెవిటి, మూగ. చదువు ఎనిమిదో తరగతికే పరిమితమైనా.. అతని సృజనాత్మకత మాత్రం ఇంజినీరింగ్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. చిన్నప్పటినుంచే అతనికి బొమ్మలంటే ప్రత్యేక ఆసక్తి. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే శంషేర్ మాత్రం అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వాటిని విడదీసి పరిశీలించేవాడు.
ఈ అలవాటే అతనిలో యాంత్రిక పరిజ్ఞానంపై ఆసక్తిని పెంచింది. మాటలు రాకపోయినా, వినలేకపోయినా చుట్టూ జరిగే విషయాలను గమనిస్తూ నేర్చుకున్న శంషేర్.. యూట్యూబ్ వీడియోలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. పాతమోటార్లు, కార్డ్బోర్డ్, చెక్క ముక్కలతో విమానాలు, జేసీబీలు, ట్యాంకులు, రోప్‌వేలు తయారుచేస్తున్నాడు.
ఈ వార్త చదివారా: నీట్ లీకేజీ నిందితుడికి.. రీటెస్టు రాసేందుకు అనుమతి