
మంచి ఆరోగ్యం, ఆయుష్షు కోసం... కాసేపైనా వ్యాయామం చేయాలని అంటున్నారు పరిశోధకులు. గంటల కొద్దీ చేయలేని వారు కనీసం 5 నిమిషాలు కసరత్తులు చేసినా, కాస్తంత కదలికలు జోడించినా... అద్భుత ఫలితాలు వస్తాయంటున్నారు. వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని తెలిసీ నిర్లక్ష్యం చేస్తుంటాం.
రోజుకు కనీసం 5 నిమిషాల సమయాన్ని వ్యాయామానికి కేటాయించినా ప్రయోజనాలెన్నో ఉన్నాయని పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి. వేగంగా నడవడం, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం, బట్టలు ఉతుక్కోవడం వంటి శారీరక శ్రమను రోజుకు కనీసం 5 నిమిషాల పాటు చేసినా ప్రతి 10 అకాల మరణాల్లో ఒకదానిని నివారించ వచ్చని తాజా అధ్యయనం చెబుతోంది.
బ్రిటన్, అమెరికా, స్కాండినేవియా దేశాల్లోని 1.50 లక్షల మంది వయోజనుల నుంచి సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ స్వల్ప వ్యాయామం అకాల మరణాల నివారణలో మెరుగైన ఫలితాన్ని ఇస్తున్నట్లు నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్‌లో శారీరక శ్రమ, ఆరోగ్యం ప్రొఫెసర్ ఉల్ఫ్ ఎకెలుండ్ తెలిపారు.
జిమ్‌కు వెళ్లడానికి లేదా క్రీడల క్లబ్లో చేరడానికి ఇబ్బంది పడేవారు కూడా తమ జీవితంలో మరింత కదలికలను జోడించడం ద్వారా ప్రయోజనం పొందుతారని ఈ అధ్యయనం రుజువుచేసింది. వ్యాయామం కోసం మన జీవనశైలిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం లేదని, స్వల్ప సమయాన్ని కేటాయిస్తే చాలని ఎకెలుండ్ వివరించారు.
నిష్క్రియను తగ్గించడం కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమని తేలింది. ఖాళీగా కూర్చునే సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం వల్ల జనాభాలో అకాల మరణాలు 7% తగ్గుతాయని గుర్తించారు. కండరాలను బలపరిచే కార్యకలాపాలు మన ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు ప్రయోజనకరంగా ఉంటాయని, అధిక ఒత్తిడి, అధిక అలసట రేట్లను ఇవి తగ్గిస్తాయని అమెరికాలోని రోడ్ ఐలాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన మానవ చలన శాస్త్ర(కైనెసియాలజీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ లోగాన్ అంటున్నారు.
వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవించారని అమెరికా అధ్యయనమొకటి తేల్చింది. రోజంతా విస్తరించి ఉండే చిన్న చిన్న శారీరక శ్రమ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు గుర్తించారు. వృద్ధుల్లో ఇది కండరాల ఓర్పును పెంచడంలో కూడా సహాయపడిందని కనుగొన్నారు.
వ్యాయామ విరామాల్ని మన దైనందిన జీవితాల్లో సులువుగా చేర్చుకోవచ్చు. హృదయ స్పందన రేటును పెంచే చిన్నచిన్న శారీరక శ్రమను రోజంతా విస్తరించుకోవచ్చు. కొద్దిసేపు వేగంగా నడవడం, నచ్చిన పాటకు పాటకు నృత్యం చేయడం, మెట్లను మామూలు కంటే వేగంగా ఎక్కి దిగడం, వేగంగా వాక్యూమ్ క్లీనింగ్ చేయడం వంటివి చేయొచ్చు. మన నిశ్చల జీవితాన్ని తగ్గించుకోవాలంటే.. వెళ్లాల్సిన చోటికి కనీసం ఐదు నిముషాల దూరంలో కారును పార్క్ చేసి, నడుచుకుంటూ వెళ్లాలని యూకేలోని లౌబరో యూనివర్సిటీలో బిహేవియరల్ మెడిసిన్ ప్రొఫెసర్ అమండా డేలీ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఏరోబిక్ వ్యాయామంతో పాటు కండరాలను బలపరిచే కార్యకలాపాలను కలిపి చేసిన 60, 70 ఏళ్ల వ్యక్తులు ఎలాంటి వ్యాయామం చేయని