
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
English teacher rude behaviour in chilpur high school Jangaon: తెలంగాణలో ఇటీవల అమావాస్య రోజు (సోమవారం) స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అన్ని స్కూళ్లలో కూడా అమావాస్య సెంటిమెంట్ కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ ఉపాధ్యాయులు మాత్రం తమ డ్యూటీకి హజరయ్యారు.
స్కూల్ పిల్లలకు పువ్వులు ఇచ్చి మరీ స్వాగతం పలికారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని చిల్పూర్ మండంలోని ఇక ఇంగ్లీష్ టీచర్ స్కూళ్లు ప్రారంభమైన వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గ్రామస్తులు, సిబ్బందిపై తన ప్రతాపం చూపింది. ఈ ఘటనపై గ్రామంలో వివాదం రాజుకుంది.
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో ఉన్న హైస్కూల్ లో జ్యోతిలక్ష్మి కొంత కాలంలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తుంది. ఆమె తరచుగా కిందిస్థాయి ఉద్యోగులు, స్కూల్ పిల్లలపై కూడా కారణంలేకుండా తరచుగా నోరుపారేసు కుంటు ఉంటుంది.
ఈ క్రమంలో జనగణన సమయంలో స్థానికంగా విద్యార్థినిని నీ తల్లిదండ్రులు గురించి చెప్పాలని అడిగింది. ఆమె చెప్పిన దానికి అసలు వీళ్లు నీ తల్లిదండ్రులు కాదని విద్యార్థినికి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో బాలిక అసలు తన తల్లిదండ్రులు ఎవరని నిద్రాహరాలు మాని ఇంట్లో వారితో, గ్రామస్తులతో గొడవకు దిగింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్ కు వెళ్లి టీచర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సర్పంచ్ కూడా అక్కడకు వచ్చి టీచర్ ను ప్రశ్నించాడు. దీంతో ఇంగ్లీష్ టీచర్ జ్యోతిలక్ష్మి ఆవేషంతో ఊగిపోయి గ్రామస్తుల మీద పుస్తకాలు విసిరి కొట్టి, వెకిలిగా నవ్వుతూ, తానే హెచ్ఎం అంటూ కుర్చీలో
కూర్చుని దురుసుగా ప్రవర్తించింది.
Read more: Nalgonda: అయ్యో.. అమావాస్య వేళ స్కూళ్లు రీ ఓపెన్.. కరెంట్ షాక్‌కు గురైన విద్యార్థి.. ఏంజరిగిందంటే..?..
అక్కడున్న పోలీసులు ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించిన వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలో నష్కల్ గ్రామస్తులు ఈ టీచర్ తమ గ్రామంలో వద్దని, విద్యార్థులు స్కూల్ కు వెళ్లేందుకు భయపడిపోతున్నారని స్థానిక అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు జ్యోతిలక్ష్మి అనే టీచర్ గతంలో కూడా పలు మార్లు ఈ విధంగానే విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కూడా దురుసుగా ప్రవర్తించిందని చెబుతున్నారు. మొత్తంగా స్కూళ్లు రీ ఓపెన్ వేళ టీచర్ వింత ప్రవర్తనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.