
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆమె ఎన్నికల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
Read also: Apollo Healthtech Shobana Kamineni: అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని పిటిషన్‌కు సంబంధించిన ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా మమతా బెనర్జీ స్వయంగా కలకత్తా హైకోర్టు రిజిస్ట్రీని సందర్శించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె ఈ చర్య తీసుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారు. సుమారు 15 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో సువేందు విజయం సాధించారు. ఒకప్పుడు టీఎంసీకి బలమైన స్థావరంగా ఉన్న భవానీపూర్‌లో వచ్చిన ఈ ఫలితం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో లోపాలు జరిగాయని మమత తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఫలితాలపై సమగ్ర న్యాయపరమైన విచారణ జరపాలని ఆమె కోర్టును కోరారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రంగా ఉంచాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేస్తూ మమత కోర్టును ఆశ్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కూడా ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు ఇంకా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎంసీ-బీజేపీ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది.
అంశంపై బీజేపీ లేదా సువేందు అధికారి నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
Vangalapudi Anita: ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది: అనిత
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Apollo Healthtech Shobana Kamineni: అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని
Cattle’s hunger : పశువుల ఆకలిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది?
China’s Population : జనాభా సంక్షోభంతో కోలుకోలేని చైనా
Tamil Nadu CM Vijay: 14 లక్షల మంది రైతులకు రూ. 75,000 రుణమాఫీ!
Dhaka Summons Indian Envoy : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగ్లాదేశ్ పీఎం సలహాదారుకు తనిఖీలు..తీవ్ర వివాదానికి దారి
తాజా ఎన్నికల పిటిషన్‌తో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య రాజకీయ విభేదాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ