లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిస్తాయి. యాక్నె, మొటిమలు వంటి చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ సహాయపడుతుంది. ఈ నూనెను వాడటం ద్వారా చర్మం యవ్వనంగా ఉంటుంది.
చర్మాన్ని లోతు నుంచి శుభ్రం చేయడంలో లెమన్‌గ్రాస్ ఆయిల్ సహాయపడుతుంది. ఈ నూనెలు వాడటం ద్వారా ముఖంపై రంధ్రాలు, మొటిమలు తగ్గుతాయి. రోజ్‌హిప్ ఆయిల్లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు తగ్గిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
రోజ్ ఆయిల్‌లోని పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. స్కి్న్ గ్లో పెంచుతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి ముడతలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతాయి. ఆరెంజ్ ఆయిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపించడంలో సహాయపడతాయి.
మీ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. క్యారెట్ సీడ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. స్కిన్ గ్లో పెంచుతాయి. చందనం నూనె చర్మాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది. స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది.
ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. ఆవశ్యక నూనెల గాఢత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ నూనెలను నేరుగా అస్సలు అప్లై చేయకూడదు. ఏదైనా క్యారియర్ ఆయిల్ (బాదం నూనె, కొబ్బరి నూనె, జోజోబా ఆయిల్)లో కొన్ని చుక్కల ఆవశ్యక నూనెలు కలిపి చర్మానికి రాసుకోవాలి.
దీంతో మంచి ఫలితం ఉంటుంది
.