టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో ఆటకు దూరంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో తనకు దొరికిన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. తన కొడుకు అకాయ్‌ను ఎత్తుకుని.. ఓ పార్క్‌లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదు.వైరల్‌గా మారిన ఫొటోల్లో విరాట్ కోహ్లీ..
తన కుమారుడు అకాయ్‌ను ఎత్తుకొని కనిపించాడు. ఇప్పటివరకు కోహ్లీ.. తన కుమారుడి ఫేస్ బహిర్గతం చేయని విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోల్లో కూడా అకాయ్ ముఖం కనిపించలేదు. నల్ల రంగు హుడీ, ఖాకీ ప్యాంటు ధరించిన విరాట్.. కుటుంబంతో సరదాగా గడిపాడు.
విరాట్ భార్య అనుష్క శర్మ కూడా అక్కడే ఉన్నట్లు కనిపించింది. వీరంతా అక్కడే ఉన్న కొందరితో మాట్లాడుతూ కనిపించారు.కాగా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. జులై 14 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
ఇందులో కోహ్లీ పాల్గొనే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్.. ఈ సిరీస్‌లో రాణించడం కీలకం. ఇప్పటికే కోహ్లీ టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు.
16 మ్యాచులలో 675 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలోనే కోహ్లీ గాయపడ్డాడు. అతడి రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
చూసే అవకాశం ఉంది.
నిర్ణీత సమయంలోగా కోలుకుంటే సరిగ్గా 4 వారాల్లో కోహ్లీని గ్రౌండ్లో