
`సేవ్ ది టైగర్స్` వెబ్ సిరీస్ ఇప్పటి రెండు సీజన్లు విజయవంతంగా రన్ అయ్యింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ వచ్చింది. `సేవ్ ది టైగర్స్ 3` పేరుతో దీన్ని రూపొందించారు దర్శకుడు మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం.
దీనికి శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, గుండు సుదర్శన్, అవినాష్, అభయ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ మూడో సీజన్ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. భార్యలతో భర్తలు పడే ఇబ్బందులు, ఈ క్రమంలో వివిధ తప్పులు చేయడం, పోలీస్ కేసులు ఇవన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
అదే సమయంలో నవ్వులు పూయించేలా ఉంది. అయితే ఇందులో రెండు ప్రపంచాలు అనేది కొత్తగా ఉంది. ఇదే వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ని సెలబ్రిటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
ఈ సిరీస్ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సెలబ్రిటీలు ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేసినట్టు చెబుతున్నారు. చాలా వరకు పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. గత రెండు సీజన్లతో పోల్చితే ఇందులో ఓ కొత్త పాయింట్ ఉందట. రెండు ప్రపంచాలుంటాయట. అదే ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు.
అందులో కన్‌ప్యూజ్డ్ కామెడీ ఆకట్టుకుంటుందని, నవ్వించేలా ఉంటుందని చెబుతున్నారు. వీరి జీవితంలోకి ఇంద్రుడు కూడా వస్తాడట. అది మరింత ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఫస్ట్ రెండు మూడు ఎపిసోడ్లు కాజువల్‌గానే సాగుతాయని, మూడో సీజన్ తర్వాత నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.
ఎమోషనల్‌గా ఉంటుందని అంటున్నారు.
దీంతోపాటు మెయిన్ క్యారెక్టర్స్ కి సంబంధించిన మరో ట్విస్ట్ ఉంటుందట. అది అస్సలు ఊహించలేరని చెబుతున్నారు. ప్రారంభంలోనే ఆయా సీన్ వస్తుందని, ఆ తర్వాత నాల్గో సీజన్ నుంచి దాని చుట్టూనే కథ నడుస్తుందని సమాచారం. మొత్తంగా నవ్విస్తూ, ఆలోచింప చేస్తూ, ఎమోషనల్‌కి గురి చేస్తుందట. అయితే కామెడీ ఫస్ట్ నుంచి అంతగా వర్కౌట్ కాలేదని, లైటర్‌వేలోనే ఉందని చెబుతున్నారు. కొంత ల్యాగ్, మరికొంత కన్ఫ్యూజ్గా ఉంటుందని చెబుతున్నారు. ఓవరాల్‌గా మాత్రం ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఇది ఎలా ఉంది, గత రెండు సీజన్లని మించి నవ్వించిందా లేదా? సర్ప్రైజ్ చేసిందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలనుందని చెప్పొచ్చు. ఏసియానెట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.
నాలుగు, ఐదు సీజన్లు హిలేరియస్‌గా ఉంటాయట. చివరి సిరీస్