
దాదాపు నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రీఎంట్రీ ఇచ్చింది. సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెరెనా బరిలోకి దిగనుంది. ఇంటర్నెట్ డెస్క్: దాదాపు నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రీఎంట్రీ ఇచ్చింది.
సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెరెనా బరిలోకి దిగనుంది. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జోడీల్లో ఒకటైన విలియమ్స్ సిస్టర్స్ మరోసారి గ్రాండ్‌స్లామ్ వేదికపై సందడి చేయనున్నారు. మంగళవారం విడుదలైన మహిళల డబుల్స్ వైల్డ్ కార్డ్ జాబితాలో సెరెనా-వీనస్ జోడీ చోటు దక్కించుకుంది.
2022 యూఎస్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు సెరీనా విరామం తీసుకుంది. ఇటీవలే క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో కెనడాకు చెందిన విక్టోరియా మోబోకోతో కలిసి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే భాగస్వామి గాయపడటంతో ఆ జోడీ టోర్నీలో ఎక్కువకాలం కొనసాగలేకపోయింది.
కాగా వింబుల్డన్‌కు ముందు బెర్లిన్ ఓపెన్‌లో కరోలినా ముచోవాతో కలిసి సెరెనా ఆడనుంది. టెన్నిస్ చరిత్రలో విలియమ్స్ సిస్టర్స్ జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో కలిసి పోటీ పడి అద్భుత విజయాలు సాధించారు.
మహిళల డబుల్స్‌లో ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఆడిన 14 మ్యాచ్‌ల్లో అన్నింట్లోనూ విజేతగా నిలవడం విశేషం. సెరెనా శక్తివంతమైన బేస్ లైన్ ఆట, వీనస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు ఎన్నో సార్లు చుక్కలు చూపించారు.
ఇప్పుడు మరోసారి ఈ సోదరీమణులు వింబుల్డన్ గ్రాస్ కోర్టులపై కలిసి అడుగుపెట్టనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్