
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు నానక్ రామ్ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ప్రస్తుత యూఎస్ కాన్సులేట్ రోడ్ను ఈ పేరుతో మార్చనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
గ్లోబల్ సిటీగా పేరొందిన హైదరాబాద్- అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా.. అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ సరికొత్త రోడ్డును ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయనతోపాటు పలువురు ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, ఐటీ పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23 న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.
హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ పేరిట నామకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇక ఇటీవల రావిర్యాల ఇంటర్ ఛేంజ్ కు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరును తెలంగాణ ప్రభుత్వం పెట్టిన విషయం తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లను కూడా కొన్ని జంక్షన్లకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే తెలంగాణ ప్రభుత్వం రోడ్ల పేర్ల మార్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు నానక్‌ రామ్‌ గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ప్రస్తుత యూఎస్ కాన్సులేట్ రోడ్ను ఈ పేరుతో మార్చనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ సిటీగా పేరొందిన హైదరాబాద్- అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా.. అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ సరికొత్త రోడ్డును ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయనతోపాటు పలువురు ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, ఐటీ పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23 న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ పేరిట నామకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇక ఇటీవల రావిర్యాల ఇంటర్‌ ఛేంజ్‌ కు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరును తెలంగాణ ప్రభుత్వం పెట్టిన విషయం తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లను కూడా కొన్ని జంక్షన్లకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం రోడ్ల పేర్ల మార్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.