
ఉన్నత చదువులు చదివిన ఆ యువకుడు సాఫ్ట్వేర్ కొలువుల వైపు వెళ్లలేదు. అన్నదాతల కష్టాలను తీర్చేందుకు తన చదువును ఆయుధంగా మార్చుకున్నాడు. రైతుల కోసం సరికొత్త ఈవీ ట్రాక్టర్ను రూపొందించాడు ఫార్మ్ సాథి ఫౌండర్ సుశాంత్. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల పనులు చేసుకునేలా దీన్ని తయారుచేసినట్టు సుశాంత్ తెలిపాడు.
పురుషులతో పాటు మహిళలు సైతం దీన్ని సులభంగా నడపొచ్చని చెబుతున్నాడు. దీనికి రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ-ట్రాక్టర్ ప్రత్యేకతలేంటి? సుశాంత్ దీన్ని ఎలా రూపొందించారు? అతడి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర..
బెజవాడ దుర్గమ్మకు బహూకరణ