టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఇప్పటి వరకు తన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్న అతడు.. ఐపీఎల్లో మ్యాచ్ ఓడిపోతే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో తన ఉగ్రరూపాన్ని చూపించాడు.
తనను కావాలని టార్గెట్ చేసే వారికి.. తన చేష్టలతో సరైన సమాధానం ఇచ్చాడు. శ్రీలంక ఏ ఆటగాళ్లకు తనదైన శైలిలో బదులిచ్చాడు. కోపంలో వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో అతడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.అయితే శ్రీలంక ఏ ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవపడేందుకు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
లంక ఆటగాళ్లు కావాలని రెచ్చగొట్టే మాటలు అనడంతోనే 15 ఏళ్ల కుర్రాడు టెంపర్ కోల్పోయాడట. ఈ మేరకు క్రీడా వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. "మ్యాచ్ ముగిసింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపో.." అని శ్రీలంక క్రికెటర్ హలంబాగే.. వైభవ్‌ను చూసి అన్నాడట.
అందుకే వైభవ్ సూర్యవంశీ ఉన్నట్లుండి కోపోద్రిక్తుడు అయిపోయాడు.హలంబాగే మాటలతో సహనం కోల్పోయిన సూర్యవంశీ.. ప్రత్యర్థి జట్టులోని ఓ ఆటగాడిని ఛాతిపై చేయి వేసి తోసేందుకు ప్రయత్నించాడు. అయితే సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
అయినప్పటికీ అతడు పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ.. చేయి చూపించి ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వైభవ్‌పై చర్యలు తీసుకుంటారా?నిజానికి 'ఏ' సిరీస్ మ్యాచులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్ అధికారులను నియమించదు.
అందుకే ఆయా మ్యాచులకు సంబంధించిన క్రమశిక్షణా వ్యవహారాలను పర్యవేక్షించడు. అయినప్పటికీ వివాదం పెద్దది కావడంతో ఇందులో జోక్యం చేసుకున్న ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై శ్రీలంక ఏ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చర్చ జరిగిందట.
.
టీమిండియాకు సారీ చెప్పాలని పలువురు.. లంక ఆటగాళ్లకు సూచించారట. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది