
తలలో చుండ్రు సమస్య వేధిస్తోందా? అయితే.. ఖరీదైన షాంపూల అవసరం లేకపోయినా ఇంట్లో ఈజీగా లభించే కొన్ని ఉత్పత్తులు రాస్తే చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను, అంతే పరిమాణంలో కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి, తలకు పట్టించాలి.
వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. కొబ్బరి నూనెను తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. గంట తర్వాత, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయాలి. ఉల్లిపాయ రసం తీసి తలకు బాగా పట్టించాలి.
గంటసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవాలి. కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి కనీసం రెండుసార్లు దీన్ని తలకు అప్లై చేయవచ్చు.
వేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును వదిలించడానికి సహాయపడతాయి. వేపాకులతో మరిగించిన నీటితో తలస్నానం చేయాలి. చుండ్రును వదిలించుకోవడానికి వారానికి ఒకసారి ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇది యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Anklet Designs: పాదాలకే అందాన్ని తెచ్చే చంద్రికా పట్టీల డిజైన్స్ Blouse Designs: క్లాసీ లుక్ ఇచ్చే బ్లౌజులు.. ఎవ్వరికైనా నచ్చేస్తాయి! Mangalsutra Designs: మెడకు నిండుగా 2 ఇన్ 1 మంగళసూత్రాలు Anklet Designs: పాదాలకు నిండుగా, అందంగా కనిపించే పట్టీలు..
చూసేయండి