
Tadipatri Politics | తాడిపత్రి అర్బన్ జూన్ 15 ప్రభాతవార్త : తాడిపత్రిలో మరోమారు పొలిటికల్ హిట్ చెల్లరేగింది. రెండు రోజుల క్రితం టిడిపి విజయోత్సవ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి సిద్ధం కాక వైఎస్ఆర్సిపి రెండేళ్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో వెన్నుపోటు పొడుస్తుందని వెన్నుపోటు కార్యక్రమం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పిలుపు ఇవ్వడంతో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు.\ Read Also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ ఇరు పార్టీల నేతలు ఒకేసారి కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు అనుమతి నిరాకరించి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేసి అనంతపురానికి తరలించారు.
టిడిపి కి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు వైఎస్ఆర్సిపి నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని అయిందని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సుమారు 6 గంటల పాటు మంచం వేసుకొని నిరసన వ్యక్తం చేసి స్నానం చేయడం జరిగింది. పెద్దారెడ్డి తమ కార్యకర్తలపై తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేయాలని పట్టు పట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని జెసి ప్రభాకర్ అందజేయడంతో నిరసన విరమించి సోమవారం పెద్దారెడ్డి బాధితులతో కలిసి అనంతపురం కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేస్తామని పిలుపునిచ్చారు.
సుమారు 100 వాహనాలతో టిడిపి నాయకులు కార్యకర్తలు వెళ్లడానికి సిద్ధం కాక ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ భరత్, టిడిపి జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు జెసి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరిపారు.
పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారి దృష్టికి జేసి ప్రభాకర్ రెడ్డి తెచ్చారు. ఎన్నికల ఘర్షణలో చాలామంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘర్షణకు సంబంధం లేకుండా రౌడీ షీట్లు తెరిచారని వాటిని మూసివేయాల్సిందిగా కోరారు.
జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు టిడిపి వారిపై చేస్తున్న దాడులు దౌర్జన్యాలపై చర్చించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Politics) పేర్కొన్న అంశాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేగా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ మంత్రి టీజీ భరత్ ఇవ్వడంతో జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ధిక్కారస్వరం పెంచడంతో ఆయనను శాంతింప చేయడానికి ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపడుతుందోనని మేధావులు భావిస్తున్నారు. తాడిపత్రి ప్రజల కోసం తాను పార్టీ, ప్రభుత్వ విధానాలు లెక్కచేయని తాడిపత్రి ప్రజల కోసం తాన ఎంత దూరం అయిన వెళ్తానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం కోసమెరుపు.
Two-Year Trust Program:సంక్షేమ పాలనపై లబ్ధిదారుల ప్రశంసల వెల్లువ!
TG Bharat: మంత్రి టీజీ భరత్‌ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
kalyandurg seed distribution:రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: ఎమ్మెల్యే సురేంద్రబాబు!
EO Srinivasa Rao: శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో సమీక్ష!
Prakash Raj: రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో టిడిపి నాయకులు కార్యకర్తలపై జరిగిన దాడులు అక్రమ కేసుల గురించి చర్చించారు. అధికారంలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి