
Tollywood Heros : సమ్మర్ బాక్సాఫీస్‌ని చేతులారా మిస్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు దసరాని టార్గెట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ సీజన్ కావడంతో సీనియర్ స్టార్ హీరోలంతా అక్టోబర్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు అని సమాచారం.
బాక్సాఫీస్ క్యాలెండర్లో ఫెస్టివల్ సీజన్‌కి జరిగే బిజినెస్ నెక్స్ట్ లెవెల్. అందుకే మేకర్స్ పండుగ సీజన్లోనే తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా డల్ అయ్యింది.
సమర్మ్ సినిమాలన్నీ వాయిదా పడటంతోనే ఈ పరిస్థితి. రామ్‌చరణ్ పెద్ది సినిమా వచ్చి కాస్త ఊపిరి పీల్చుకుంది టాలీవుడ్. సోసోగా సాగుతున్న ఫస్ట్‌హాఫ్‌ని దృష్టిలో ఉంచుకున్న మేకర్స్ ఇప్పుడు దసరాని టార్గెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ రిలీజ్ ఊసేలేని మెగాస్టార్ విశ్వంభర సినిమా జూలై నుంచి అక్టోబర్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దసరా కానుకగా విశ్వంభరని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా కూడా ఈ ఫెస్టివల్ సీజన్‌నే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ప్రజెంట్ షూటింగ్ జెట్‌స్పీడ్‌లో జరుగుతుండటంతో దసరాకే బాలయ్య సినిమాని బాక్సాఫీస్ ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రీసెంట్గా విడుదలైన NBK111 గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసింది. Also See : Dishani Chakraborty : అమెరికన్ తో నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ఫొటోలు.. అదే స్ట్రాటజీతో ఉన్నానంటున్నారు అక్కినేని నాగార్జున.
తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తోన్న నాగ్ వందో సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. టబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోన్న ఈ మూవీని దసరాకే విడుదల చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
, బాలయ్య, నాగార్జున కంటే ముందుగా ఈ ఇయర్ దసరాని టార్గెట్ చేస్తున్నారు విక్టరీ వెంకటేశ్. నిజానికి త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఆదర్శ కుటుంబం సినిమా సమ్మర్‌కే విడుదల కావాలి. కానీ ప్యాచప్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదలపై క్లారిటీ ఇవ్వని మేకర్స్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని దసరా ఫెస్టివల్ సీజన్‌కి థియేటర్స్‌లోకి తెచ్చే ప్లానింగ్‌తో ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
Also See : Rasha Thadani : శ్రీనివాస మంగాపురం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రాషా తడాని.. మహేష్ బాబు అన్న కొడుకుతో..
మొత్తంగా టాలీవుడ్ సీనియర్స్ అందరూ దసరానే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. నలుగురు సీనియర్ హీరోలు ఒకేసారి పోటీపడినట్టు రికార్డ్ కూడా సెట్ అవుతుంది. కానీ థియేటర్స్ పోటీ కూడా ఉంటుంది. మరి నలుగురు హీరోలు వస్తారా ఎవరైనా తగ్గుతారా చూడాలి.
ఒకవేళ మిస్ అయితే మాత్రం ఈ సినిమా సంక్రాంతికే. చిరు