
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు సాయుధుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ బాస్కేట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో 53 ఏళ్ల అనంతరం న్యూయార్క్ నిక్స్ జట్టు ఛాంపియన్గా నిలవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే సమయంలో కొందరు వ్యక్తులు బ్యాట్లతో పోలీసు వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 63మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కూలిన రష్యా బాంబర్.. వీడియో వైరల్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.