
దగ్గు సిరప్‌ల విక్రయాలపై దేశవ్యాప్తంగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇకపై సిరప్ బాటిల్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందువల్ల ఇకపై నేరుగా మెడికల్ దుకాణానికి వెళ్లి దగ్గు సిరప్ కొనే అవకాశం లేదు.
చాలా మందికి దగ్గు వచ్చినా, జలుబు చేసినా, ముఖ్యంగా పిల్లల విషయంలో…డాక్టర్ ను సంప్రదించకుండానే మందులు కొనే అలవాటు ఉంది. దానివల్ల అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు పోతున్నాయని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోలేదు.
దేశంలోని అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ అయిన 'డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు' (DTAB) తో లోతుగా సంప్రదించిన తర్వాతే 1945 ఔషధ నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఈ సిరప్లు 'షెడ్యూల్ కె' జాబితాలో ఉండేవి. అంటే.. వీటిని ఓవర్ ది కౌంటర్ (OTC) డ్రగ్స్‌గా సులభంగా విక్రయించవచ్చు.
కానీ కేంద్రం తాజాగా వీటిని ఆ స్పెషల్ లిస్ట్ నుండి తొలగించింది. దీని అర్థం ఏమిటంటే.. ఇకపై ఈ మందులు కొనాలన్నా, అమ్మాలన్నా కచ్చితమైన మెడికల్ పర్యవేక్షణ ఉండాల్సిందే. సాధారణ జలుబు, దగ్గు మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు.
ఈ నిర్ణయానికి కారణం...గతేడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన విషాదం. అక్కడ 'కోల్డ్రిఫ్' (Coldrif) అనే నాసిరకం దగ్గుమందు తాగడం వల్ల 20 మందికి పైగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల తర్వాత అధికారులు సదరు కంపెనీ ఉత్పత్తులను ల్యాబ్ టెస్టింగ్‌కు పంపగా..
విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆ సిరప్‌లో ఏకంగా 48.6 శాతం 'డైఇథైలిన్ గ్లైకాల్' (Diethylene Glycol) ఉన్నట్లు తేలింది. ఇది పారిశ్రామిక అవసరాలకు వాడే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కెమికల్. ఇది శరీరంలోకి వెళ్తే కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి.
ప్రజలకు అందకుండా ఉండటానికే కేంద్రం ఈ పాలసీని తీసుకొచ్చింది.
అందుకే ఆ సిరప్‌ను నిషేధించింది. భవిష్యత్తులో ఇలాంటి నాసిరకం బ్రాండ్లు