
బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ నటి సంచితా ఉగాలే (Sanchitha Ugale) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.
సీరియల్ నటి సంచితా ఉగాలే (Sanchitha Ugale) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సంచితా.. సీరియల్ నటిగా కెరీర్ ని ప్రారంభించారు. కుంకుమ భాగ్య సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఆ తరువాత సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా తో పాటు, మనోజ్ బాజ్పాయ్ నటించిన సైలెన్స్-2 చిత్రంలోనూ సంచితా కీలక పాత్రలు పోషించారు.
ఎంతో ఆనందంగా.. అందరితో నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే సంచితా.. ఆదివారం కూడా ఎంతో హ్యాపీగానే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో, చేతినిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండి కూడా ఆమె ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న మర్మమేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సంచితా సూసైడ్ కేసును ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటనా స్థలంలో ఏదైనా సూసైడ్ నోట్ దొరికిందా? లేదా వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంచితా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కూతురిని చూశారా..
సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్లు కూడా పనికిరారు సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని..! నా బాడీ కౌంట్ 5.. విష్ణుప్రియ