
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Extramarital Affairs Report: కారణాలు ఏమైనా కావొచ్చు.. ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో పడి ఎందరో తమ కుటుంబాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు.
ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయడం.. భార్యను భర్త చంపేయడం.. ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వివాహం తర్వాత మరొకరితో సంబంధం పెట్టుకోవడం అనేది తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. ఈ అక్రమ సంబంధాలు వివాహిత జంటలను విడదీయడమే కాకుండా..
ప్రజలలో ఒత్తిడి, కుంగుబాటు, మానసిక క్షోభ మిగులుస్తున్నాయి. ఇటీవల వివాహేతర సంబంధాలకు సంబంధించిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన ప్రపంచ నివేదిక వెలువడింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఉన్న దేశాలలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది.
ఇక్కడ దాదాపు 51 శాతం మంది ప్రజలు వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జనాభాలో సగానికి పైగా తమ భాగస్వాములకు నమ్మకంగా లేనందున.. వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాంస్కృతిక, సామాజిక మార్పుల మధ్య సంబంధాల గౌరవం వేగంగా క్షీణిస్తోంది.
ఈ జాబితాలో డెన్మార్క్ రెండోస్థానంలో ఉంది. డెవలప్మెంట్కు ప్రసిద్ధి చెందిన డెన్మార్క్.. వైవాహిక విశ్వసనీయత విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ దేశంలో వివాహితులలో దాదాపు 46 శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తూ.. ఇతరులతో సంబంధాలు కలిగి ఉన్నారు.
వంటి అభివృద్ధి చెందిన దేశం నుంచి ఇలాంటి గణాంకాలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. 45 శాతానికి పైగా జర్మన్లు ఇతరులతో శారీరక లేదా భావోద్వేగ సంబంధాలను కలిగి ఉన్నారు. ఆధునిక జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య వైవాహిక సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉండడం సాధారణంగా మారిపోయింది.
ఈ జాబితాలో ఇటలీ నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో సంపన్న దేశంలో ఇటలీ ఎదుగుతోంది. కానీ ఆ దేశంలో సామాజిక, నైతిక విలువలు భిన్నంగా ఉన్నాయి. ఇటలీలో 45 శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాలలో కలిగి ఉన్నారు. ఈ దేశంలో ప్రజలు వైవాహిక సంబంధాలను లైట్ తీసుకుంటూ.. ఇతరులతో అక్రమ సంబంధాలకు మొగ్గు చూపుతున్నారు.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ సర్వే ప్రకారం.. ఫ్రాన్స్ దేశం ఐదో స్థానంలో ఉంది. ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శృంగారాల భూమిగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ శృంగారం మధ్యలోనే భాగస్వాముల పట్ల నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. ఈ దేశంలో పెళ్లైన వారిలో దాదాపు 43 శాతం మంది వివాహేతర సంబంధాలలో ఉన్నారు. మరో విచిత్రం ఏంటంటే.. ఇక్కడ వివాహేతర సంబంధాలను పెద్దగా పట్టించుకోరు. తమ భాగస్వాములను ఈజీగా మోసం చేస్తూ.. ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు.
భారత్‌లోనూ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొదటి 10 దేశాలలో మన దేశం లేదు. భారతీయ సంస్కృతి, సమాజంలో వివాహాన్ని పవిత్రమైన బంధంగా భావిస్తారు. మన దేశంలో విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తారు. కొన్ని పట్టణ ప్రాంతాలలో ఇటీవల కేసులు పెరుగుతున్నా ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్ ఇప్పటికీ చాలా సురక్షితమైన, నైతికంగా దృఢమైన దేశంగా నిలుస్తోంది.
ఇక్కడ నిత్యం అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వివాహేతర సంబంధాలలో జర్మనీ మూడోస్థానంలో ఉంది. జర్మనీ