
Sanchita Ugale Last Video: బుల్లితెర నటి, ప్రముఖ హిందీ ధారావాహిక ‘కుంకుమ్ భాగ్య’ ఫేమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య కేసు టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న వయసులోనే ఆమె ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం సహచర నటీనటులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసుల ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. Read also: Vijay Deverakonda Rashmika: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇంట్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డిన్నర్! సంచిత ఉగాలే ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య కాలంలో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.
అయితే, ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ గానీ, ఇతర ఆధారాలు గానీ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సంచిత ఆత్మహత్యకు పాల్పడటానికి కేవలం కొన్ని గంటల ముందే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఎంతో సంతోషంగా, నవ్వుతూ, పూర్తి ఉత్సాహంగా కనిపించారు. ఎంతో యాక్టివ్గా ఉన్న నటి.. ఆ వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే బలవన్మరణానికి శరణు జొరడం అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా కలవరపెడుతోంది.
అసలు ఆ కొన్ని గంటల వ్యవధిలో ఆమె జీవితంలో ఏం జరిగింది? అనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం పోలీసులు సంచిత కుటుంబ సభ్యుల ప్రాథమిక వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? లేదా వృత్తిపరమైన ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా?
అనే కోణంలో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె సన్నిహితులను, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ కో-యాక్టర్లను
, ఇండస్ట్రీలోని మరికొందరు స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. సంచిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వచ్చే వైద్య నివేదికల ఆధారంగా తదుపరి విచారణను మరింత వేగవంతం చేస్తామని పోలీసులు మీడియాకు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు సంచిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
SSC CGL Job Notification:గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు భారీగా పెరిగిన ఖాళీలు..జూన్ 22 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Chittoor incident: పుంగనూరులో వజ్రాల కోసం గణేష్ విగ్రహం ధ్వంసం
Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా?
Marius Borg Hoiby: నార్వే ప్రిన్స్ సవతి కుమారుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
Madhya Pradesh Crime: భార్య మెడకు ఇనుప గొలుసు వేసి పైశాచిక దాడి.. ఓ భర్త వికృత చేష్టలు
Indian man arrested in Nepal : లోదుస్తుల్లో మాదకద్రవ్యాలు దాచిన భారతీయుడు నేపాల్లో అరెస్టు
Sangam crime: దువ్వూరులో రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ ఆత్మహత్య!