
Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగం, అవినీతిపై ఆయన శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంపై తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ నడుస్తున్న తరుణంలో, సాక్షాత్తూ ఈ మూవ్మెంట్ వ్యవస్థాపకుడిపైనే దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. Read also: Minister Rammohan Naidu:భూములిచ్చిన రైతులకు రాయల్ గౌరవం.. జేవార్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ వారి కోసమే!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్‌లో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువత నినాదాలు చేస్తుండగా, ఒక్కసారిగా కొందరు దుండగులు గుంపులోకి దూసుకొచ్చి ఆయనపై భౌతిక దాడికి దిగారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
వెంటనే అప్రమత్తమైన తోటి నిరసనకారులు, యువకులు అభిజిత్‌ను కాపాడుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఏమిటి? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తుల హస్తం ఉందా?
లేదా ముందస్తు ప్రణాళికతోనే ఈ కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను, సోషల్ మీడియా లైవ్ వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో..
అంతలోనే ఏం జరిగింది? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Perfect Health : నిత్య యవ్వనం, నిండు ఆరోగ్యం: ఉదయాన్నే చేయాల్సిన
అలవాట్లు!
Minister Rammohan Naidu:భూములిచ్చిన రైతులకు రాయల్ గౌరవం.. జేవార్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ వారి కోసమే!
TET Exam : విద్య నాణ్యత పేరుతో గతానికి ‘పరీక్ష’ శిక్షలా?
NTA NEET 2026 Fee Refund:ఫీజు రీఫండ్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన NTA!
US EB-5 : అక్టోబర్ వరకు అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీకు బ్రేక్!
Dust storm hits Delhi : ఢిల్లీని తాకిన ధూళి తుఫాను..రెడ్ అలర్ట్ జారీ