తమదైన నటన, సహజసిద్ధమైన అందంతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నటి నివేదా పేతురాజ్ ఒకరు. ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ బ్యూటీ, గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో వెండితెరకు దూరంగా ఉంటున్నారు.
అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ సింగ్ గీతం ’ సినిమా ప్రెస్ మీట్లో నివేదా ఒక్కసారిగా ప్రత్యక్షమై తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్లో ఎదుర్కొన్న చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారాయి.
హిమాలయాలకు వెళ్లాలనే ఆలోచన!నివేదా పేతురాజ్‌కు అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే, గత ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళ పారిశ్రామికవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు నెట్టింట ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.
కానీ విధి ఆడిన వింత నాటకంలో నిశ్చితార్థం జరిగిన కేవలం నాలుగు నెలలకే ఆ బంధం ముక్కలైంది. ఎంగేజ్మెంట్ రద్దు కావడంతో నివేదా తీవ్ర మానసిక క్షోభకు, ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.ఈ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ నివేదా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ..
"2023 ఆఖర్లో నేను చిత్ర పరిశ్రమను శాశ్వతంగా వదిలేయాలని గట్టిగా అనుకున్నాను. నా జీవితం తప్పుడు దారుల్లో వెళ్తోందని, నేను తీసుకున్న కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల తీవ్ర గందరగోళంలో పడిపోయాననిపించింది. ఆ డిప్రెషన్ నుండి తట్టుకోలేక, అంతా వదిలేసి ఒంటరిగా హిమాలయాలకు వెళ్లిపోవాలని, అక్కడే ధ్యానం చేస్తూ జీవితాన్ని గడపాలని మానసికంగా సిద్ధమయ్యాను" అంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు.* రూ.500ల కోసం 8 గంటలు నిలబడ్డా..
ఊపిరి పోసిన నాగ్ అశ్విన్ తీవ్ర నిరాశలో ఉన్న నివేదా జీవితాన్ని టాలీవుడ్ స్టార్ మేకర్ నాగ్ అశ్విన్ ఒక్క పిలుపుతో మలుపు తిప్పారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైవైజంతి మూవీస్ నిర్మించిన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’లో ఒక కీలక పాత్ర కోసం నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించారు. ఈ సినిమాలో నివేదా, రాహుల్ రవీంద్రన్ కలిసి కథకు ఆయువుపట్టు లాంటి హీరో తల్లిదండ్రుల పాత్రలను పోషించారు. థియేటర్లలో సినిమా చూసేవరకు నివేదా ఈ చిత్రంలో నటించిన విషయాన్ని చిత్ర బృందం ఎంతో గోప్యంగా ఉంచడం విశేషం. "నాగ్ అశ్విన్ గనుక నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు, హిమాలయాల్లో ఉండేదాన్ని. ఈ సినిమా నాకు పునర్జన్మను ఇచ్చింది. థియేటర్లో అవుట్‌పుట్ చూసి నేను థియేటర్లోనే ఏడ్చేశాను" అని నివేదా పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన 'దాస్ కా ధమ్కీ', ఓటీటీలో వచ్చిన 'బూ' చిత్రం, 'పరువు' వెబ్ సిరీస్ తర్వాత ఆమెకు ఇది ఒక మైండ్‌బ్లోయింగ్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి.వరుస ఆఫర్లు 'సింగ్ గీతం' సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన నివేదా పేతురాజ్ అదృష్టం ఇప్పుడు టాలీవుడ్లో ఒక్కసారిగా మారిపోయింది. కమ్‌బ్యాక్ ఇవ్వడమే ఆలస్యం.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఇద్దరు సీనియర్ మోస్ట్ స్టార్ హీరోల భారీ చిత్రాల్లో ఆమె కీలక పాత్రలను దక్కించుకున్నారు. దర్శకుడు బాబీ (KS రవీంద్ర) సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా భారీ యాక్షన్ చిత్రంలో నివేదా ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో జరిగిన లాంగ్ షెడ్యూల్ ముగియగా, అదే రోజున నివేదా పేతురాజ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ సమక్షంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ, దర్శకుడిపై ఉన్న గౌరవంతో నివేదా నటించారు. ఆ నమ్మకానికి ప్రతిఫలంగానే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న 'ఆదర్శ కుటుంబం' అనే భారీ క్రేజీ ప్రాజెక్టులో నివేదాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ దక్కినట్లు ఫిలింనగర్ టాక్. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా, గుండె నిబ్బరంతో నిలబడి వరుసగా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్న నివేదా పేతురాజ్ డెడికేషన్‌ను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే హీరోయిన్ని అయ్యేదాన్నే కాదు - సమంత