
మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల మార్కును దాటి రికార్డుల దుమ్ము దులిపేశారు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి వెనుక ఒకరుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ గ్లోబల్ వైడ్‌గా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టారు. ఈ రేరెస్ట్ అచీవ్మెంట్తో మెగా అభిమానులు ప్రస్తుతం కాలర్ ఎగరేస్తూ పండగ చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాక్సాఫీస్‌కు తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ఊపిరి ఊదారు. ఈ సినిమా థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌గా నిలవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపిస్తూ చిరు క్రియేట్ చేసిన ఈ రేంజ్ కలెక్షన్స్ మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్ వర్గాలకు చూపెట్టాయి. ఒకవైపు తండ్రి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకుమించిన స్పీడుతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు.
బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రూలింగ్ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నమ్మసక్యం కాని రీతిలో ₹393 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది.
చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ కలెక్షన్ల వేటగా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా ₹300 కోట్ల క్లబ్లో చేరడం ఇదే తొలిసారి. ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి తమ సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి
అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ సరికొత్త అధ్యాయంపై రికార్డుల పోస్టర్లు షేర్ చేస్తూ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో హడావుడి చేస్తున్నారు.