
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు. ఈ మూవీ టీమ్‌తో స్పెషల్ చిట్ చాట్. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru), హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram).
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, విడుదలకు అన్ని విధాలా ఈ సినిమా సిద్ధమైంది.
ఈ క్రమంలో సమంత అండ్ టీమ్ యమా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సమంత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ రికార్డ్ ఏమిటంటే.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఒకే రోజు 40 ఇంటర్వ్యూలలో పాల్గొనడం.
ఇప్పటి వరకు ఏ స్టార్ చేయని ఫీట్‌ని ఆమె సాధించి, సినిమా అంటే ఆమెకు ఎంతో ఇష్టమో తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆమె ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని విశేషాలను తెలియజేశారు. సమంత 3 ఏళ్ల బ్రేక్ గురించి మాట్లాడుతూ..
కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒక రేస్లాగా ఏడాదికి 5 సినిమాలు చేస్తే.. అందులో రెండో, మూడో సక్సెస్‌లు అవుతుండటంతో కెరీర్ సాఫీగా సాగిపోయింది. కానీ, తీసుకున్న బ్రేక్‌తో అసలు ఈ రేస్ ఎవరి కోసం, ఎవరితో పోటీ అనేది అర్థమైంది. ఇప్పుడు కేవలం సెట్లో ఎంజాయ్ చేసేలా, ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా, నాలో ఇంప్రూవ్మెంట్ కనిపించేలా ఉండే
సినిమాలే చేయాలనుకుంటున్నాను.. అలా లేదంటే ఇంటి దగ్గరే ఉండటం బెటర్ అనుకుంటున్నానని తెలిపారు.
సినిమాలో క్యారెక్టర్‌కి, నా రియల్ లైఫ్ పాత్రకి చాలా పోలికలు ఉన్నాయి (ఆ అమ్మాయికి వంట రాదు, నాకూ రాదు) అంటూ సమంత నవ్వుతూ చెప్పగా.. సమంతలో ఉన్న నిరంతర ‘ఫైటింగ్ స్పిరిట్’ (ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా పోరాడే తత్వం) చూసి, దాన్నే సినిమాలో యాక్షన్‌గా మార్చానని రాజ్ చెప్పారు. మొదట ఈ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అనుకున్నప్పుడు స్క్రిప్ట్‌లో అంత యాక్షన్ లేదు. కానీ సమంత వచ్చాక, తన యాక్షన్ స్కిల్ సెట్ బాగా సూట్ అవుతుందని రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ జోడించినట్లుగా ఆయన తెలిపారు.
గతంలో చేసిన ‘యూటర్న్, యశోద, ఓ బేబీ, శాకుంతలం’ సినిమాలకు, ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటి అని అడిగితే.. ‘ఈ సినిమా వాటన్నిటి కంటే భిన్నమైనది. ఇందులో యాక్షన్, డ్రామా, కామెడీ, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ ఉన్న ఫుల్ రేంజ్ క్యారెక్టర్ చేశాను. షూటింగ్లో ఒకే రోజు బస్ ఫైట్, కామెడీ సీన్, క్లైమాక్స్ చేశాను.. ఒక రకంగా ఈ సినిమా నన్ను బాగా టెస్ట్ చేసింది. ఒక ఫుల్ రేంజ్ మాస్ హీరో పాత్రను ఇందులో చేశానని చెప్పొచ్చు. సాధారణంగా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో హీరోయిన్ అంటే త్యాగాలు చేసే ఒక ఏంజెల్లా చూపిస్తారు. ఆ టైప్ కాస్టింగ్‌ను బ్రేక్ చేసి, మహిళలు కూడా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయగలరని నిరూపించడమే ఈ సినిమా ఉద్దేశం. ప్రభాస్ చెయ్యి అలా పెడితే చాలు రూ. 100 కోట్లు వచ్చేస్తున్నాయి. కానీ ఆయన ఫస్ట్ సినిమాలో చెయ్యి అలా పెట్టలేదు కదా. హీరోగా మొదలైన దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆయన ఆ స్టేటస్‌కు చేరుకున్నారని సమంత తెలపగా.. విజయశాంతి తర్వాత ఆ మాస్ యాక్షన్ స్లాట్ ఖాళీగా ఉందని, హీరోల లాగే మహిళలకూ సరైన ఎలివేషన్స్ ఇస్తే ఆ స్థాయికి వెళ్లగలరని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. ఇంకా సమంత అండ్ టీమ్ చెప్పిన మరిన్ని విశేషాల కోసం పై వీడియో చూసేయండి.
బాలీవుడ్లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్