
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైపూర్/న్యూఢిల్లీ, జూన్ 15: దేశ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గనుక ఇప్పుడు బతికుంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి హిందువులన్నా, హిందూత్వ అన్నా తీవ్ర ద్వేషమని మండిపడింది.
జైపూర్లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి 'అత్యంత ప్రమాదకరమైన' వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
'నేను పూర్తి బాధ్యతతో ఈ మాట చెబుతున్నాను.. దేశంలో ప్రస్తుత వాతావరణం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. దేశ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా మతపరమైన ధ్రువీకరణకు పాల్పడుతున్నారు' అని అశోక్ గహ్లోత్ ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. 'దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఒక ఐదు సీట్లు ఇవ్వాల్సింది. కానీ తాము కేవలం 'ప్యూర్ హిందూత్వ పార్టీ' అని ప్రొజెక్ట్ చేసుకోవడమే వారి ఉద్దేశం.
నిలదీశారు.
కాంగ్రెస్కు హిందువులంటే ద్వేషం: బీజేపీ కౌంటర్
అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి హిందువులు, హిందూత్వంపై ఉన్న ద్వేషాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందూత్వం అనేది ఒక జీవన విధానం. మరి దానిని ఇందిరాగాంధీ ఎందుకు నిషేధిస్తారు?' అని పూనావాలా ప్రశ్నించారు. అశోక్ గహ్లోత్ వ్యాఖ్యల్లో కాంగ్రెస్ నాయకుల 'ఎమర్జెన్సీ మైండ్సెట్' కనిపిస్తోందని విమర్శించారు.
'కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లా లేదు.. అది ఒక 'ఇండియన్ నేషనల్ ఖిలాఫత్' లా మారిపోయింది. అందుకే వారు దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలదే అంటారు. కాంగ్రెస్కు ముస్లింలు కావాలి, కానీ ఎవరైనా హిందూత్వం గురించి మాట్లాడితే మాత్రం వారిని పాపాత్ములుగా చూస్తూ చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు.' అని పూనావాలా మండిపడ్డారు.
కేవలం హిందూత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించాలనేదే వారి ఆలోచన. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నాయకురాలు నేడు బతికుంటే ఇలాంటి పార్టీపై నిషేధం విధించేవారు. కేవలం హిందువుల పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా?' అని ఆయన