
Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 106 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరవగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ విశ్వరూపం చూపించింది.
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు భారత స్టార్ ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ కోలుకోలేని దెబ్బ తీసింది. గత వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి, ఈ మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది.
తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను క్రీజులో కదలకుండా చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమె కెరీర్లోనే ఇది అత్యుత్తమ టీ20 బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. దీప్తి ధాటికి పాక్ జట్టు 13 ఓవర్లలోనే 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం బౌలింగ్‌తోనే కాకుండా తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా పాక్ ఓపెనర్ మునీబా అలీ 41 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని భారత్‌కు ముప్పుగా మారుతున్న సమయంలో దీప్తి శర్మ ఒక అద్భుతమైన రనౌట్ చేసింది.
క్రీజు వెలుపల ఉన్న మునీబా అలీని గమనించిన దీప్తి, చిరుతపులిలా కదిలి బంతిని అందుకుని వికెట్లకు నేరుగా కొట్టింది. ఈ బుల్లెట్ లాంటి త్రోకు మునీబా అలీ రనౌట్ కాక తప్పలేదు. ఈ ఒక్క రనౌట్‌తో పాకిస్తాన్ గెలుపు ఆశలు పూర్తిగా సమాధి అయ్యాయి.
Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 106 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరవగా, బౌలింగ్‌లో దీప్తి శర్మ విశ్వరూపం చూపించింది.
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు భారత స్టార్ ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ కోలుకోలేని దెబ్బ తీసింది. గత వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి, ఈ మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను క్రీజులో కదలకుండా చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమె కెరీర్లోనే ఇది అత్యుత్తమ టీ20 బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. దీప్తి ధాటికి పాక్ జట్టు 13 ఓవర్లలోనే 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం బౌలింగ్‌తోనే కాకుండా తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా పాక్ ఓపెనర్ మునీబా అలీ 41 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని భారత్‌కు ముప్పుగా మారుతున్న సమయంలో దీప్తి శర్మ ఒక అద్భుతమైన రనౌట్ చేసింది. క్రీజు వెలుపల ఉన్న మునీబా అలీని గమనించిన దీప్తి, చిరుతపులిలా కదిలి బంతిని అందుకుని వికెట్లకు నేరుగా కొట్టింది. ఈ బుల్లెట్ లాంటి త్రోకు మునీబా అలీ రనౌట్ కాక తప్పలేదు. ఈ ఒక్క రనౌట్‌తో పాకిస్తాన్ గెలుపు ఆశలు పూర్తిగా సమాధి అయ్యాయి.
Team India are firing in all departments! 🔥#DeeptiSharma's pinpoint throw catches Muneeba Ali short of her ground.
ICC Women's #T20WorldCup 2026 | #INDvPAK | LIVE NOW 👉 — Star Sports (@StarSportsIndia) June 14, 2026 భారత్, పాక్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, దాని వెనుక రాజకీయ ఉద్రిక్తతలు కూడా కనిపిస్తుంటాయి. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో ఇరు దేశాల మధ్య సరిహద్దు గొడవల కారణంగా పురుషుల జట్టు షేక్ హ్యాండ్స్ చేసుకోలేదు. అదే పద్ధతి ఈ మ్యాచ్‌లోనూ రిపీట్ అయింది. టాస్ సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం చేతులు కలుపుకోకుండానే మైదానాన్ని వీడటం గమనార్హం. "మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాము, కేవలం క్రికెట్ గురించే మాట్లాడతాము" అని హర్మన్‌ప్రీత్ మ్యాచ్‌కు ముందే స్పష్టం చేసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షెఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) వికెట్లు కోల్పోయి షాక్ తగిలింది. అయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (68 రన్స్, 44 బంతుల్లో) కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో (36) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. పాక్ ఫీల్డర్లు ఇచ్చిన క్యాచ్ డ్రాప్‌లను ఉపయోగించుకుంటూ స్మృతి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరు అందించింది. మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ మాట్లాడుతూ.. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియానికి 18 వేల మందికి పైగా అభిమానులు వచ్చి తమకు సపోర్ట్ చేశారని, ఇంగ్లండ్‌లో ఆడుతున్నా స్వదేశంలో ఆడుతున్న భావనే కలిగిందని సంతోషం వ్యక్తం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ICC Women's #T20WorldCup